రాజన్న సిరిసిల్ల జిల్లా : గ్రూప్ 1 అభ్యర్థులపై పోలీసులు లాఠీ చార్జీ చేయడం అమానుషం అని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అన్నారు.ఈ సందర్బంగా తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ అశోక్ నగర్ లో గ్రూప్ వన్ అభ్యర్థులు వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగ యువతీ యువకులను పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తూ వారి పైన లాఠీ చార్జి చేయడం చాలా దురదృష్టమని,అమ్మాయిలు, అబ్బాయిలు అని చూడకుండా పోలీసులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారని ఇష్టం వచ్చిన దగ్గర కొట్టారని అన్నారు.
మేమేం ఎం తప్పు చేయలేదు అని మొరపెట్టుకున్న మమ్మల్ని కొట్టద్దు అని చేతులు ఎత్తి దండం పెట్టిన పోలీసుల లాఠీలకు పని చెప్పారని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరుండి మరి నిరుద్యోగుల పైన పోలీసులతో లాఠీచార్జ్ చేపించారని ఇది ముమ్మాటికి కాంగ్రెస్ కుట్ర అని అన్నారు.
జీవో నెంబర్ 29 నీ రద్దు చేయాలని అభ్యర్థులు రోడ్లపైకి వస్తే వారి సమస్యలు పరిష్కరించాల్సింది పోయి పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తినాల్సిన పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని పేర్కొన్నారు.ఎలక్షన్లకు ముందు ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హామీ ఇచ్చారని ఇపుడు పత్త లేకుండా పోయారు అని అన్నారు.
ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
నిరుద్యోగులని నమ్ముకుని గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు వారి పైన ఇలా కర్కశంగా పోలీసులతో ఇష్టనురీతి లో లాఠీ ఛార్జ్ చేయించడం సరికాదన్నారు.
ప్రశ్నించే గొంతుకలు ఇపుడు ఎక్కడికి పోయారని ఆయన అన్నారు.బి ఆర్ ఎస్ హయం లో 10 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎవరికి కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని.
నిన్నటి రోజున అశోక్ నగర్ లో ఎక్కడ చూసినా ఏ గల్లి చూసినా 400&500 మంది పోలీసులతో చుట్టుముట్టి లాఠీలకు పని చెప్పారని.ఇందుకేనా మేము కాంగ్రెస్ గెలిపించుకున్నమా అని నిరుద్యోగులు వాపోయారని, తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు ఎలా తిన్నామో ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ చూస్తున్నామని ఆయన మండిపడ్డారు.
ఇప్పటికైనా ప్రభుత్వ ధోరణి మార్చుకొని గ్రూప్ 1 అభ్యర్థులకు తగిన పరిష్కారం చూపించాలని ఆయన అన్నారు.నిరుద్యోగులకు అండగా భారత రాష్ట్ర సమితి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్, కోడం వెంకటేష్ వావిలాల సాయి, ఒగ్గు అరవింద్,ముడం సాయి, అరవింద్,అనిల్ గౌడ్,నరోజు వెంకటేష్, నవీన్, నెల్లూట్ల అభి తదితరులు పాల్గొన్నారు.







