నెయ్యితో ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే వద్దన్నా మీ జుట్టు దట్టంగా పెరుగుతుంది!

సాధారణంగా కొందరిలో హెయిర్ గ్రోత్( Hair Growth ) అనేది అస్సలు ఉండదు.దీని వల్ల జుట్టు రోజురోజుకు పల్చగా మారిపోతూ ఉంటుంది.

 This Ghee Mask Helps To Improve Hair Growth Details, Hair Growth, Latest News,-TeluguStop.com

ఈ సమస్యకు అడ్డుకట్ట వేయడానికి, హెయిర్ గ్రోత్ ను పెంచుకునేందుకు తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.అయితే అలాంటి వారికి నెయ్యి( Ghee ) చాలా బాగా సహాయపడుతుంది.

నెయ్యి ఆరోగ్యానికి మాత్రమే కాదు కురుల సంరక్షణకు కూడా తోడ్పడుతుంది.మరి నెయ్యిని జుట్టుకు ఎలా ఉపయోగించాలి.? అది అందించే ప్ర‌యోజ‌నాలేంటి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి.అలాగే మూడు టేబుల్ స్పూన్లు గడ్డ పెరుగు( Curd ) మరియు వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive Oil ) లేదా ఆవ నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.40 నిమిషాల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

Telugu Curd, Ghee Benefits, Ghee Care, Ghee, Care, Care Tips, Fall, Healthy, Lat

వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ మాస్క్ ను వేసుకుంటే కనుక చాలా లాభాలు పొందుతారు.నెయ్యిలో ఒమేగా -3 మరియు ఒమేగా -9 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి జుట్టు పెరుగుదలను ప్రేరేపించడంలో సహాయపడుతాయి.నెయ్యిలోని విటమిన్లు మరియు ప్రోటీన్లు జుట్టును మూలాలను బలోపేతం చేస్తాయి.హెయిర్ ఫాల్ ను అడ్డుకుంటాయి.కురుల‌ను ద‌ట్టంగా మారుస్తాయి.

Telugu Curd, Ghee Benefits, Ghee Care, Ghee, Care, Care Tips, Fall, Healthy, Lat

అలాగే నెయ్యిలో మెండుగా ఉండే ఫ్యాటీ యాసిడ్స్‌ జుట్టు మరియు స్కాల్ప్‌ను హైడ్రేట్ చేస్తాయి.పొడి, చిట్లిన జుట్టును రిపేర్ చేస్తాయి.కురుల‌ను మృదువుగా, షైనీగా మెరిపిస్తాయి.

నెయ్యిలో ఉండే విట‌మిన్ ఇ( Vitamin E ) జుట్టును డీప్ కండిషన్ చేస్తాయి.నెయ్యిలోని యాంటీ ఆక్సిడెంట్లు చుండ్రుకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ మరియు మైక్రోబియల్ ఇన్ఫెక్షన్‌లతో పోరాడుతాయి.

చుండ్ర స‌మ‌స్య‌కు స‌మ‌ర్థ‌వంతంగా చెక్ పెడ‌తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube