నెయ్యితో ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే వద్దన్నా మీ జుట్టు దట్టంగా పెరుగుతుంది!

సాధారణంగా కొందరిలో హెయిర్ గ్రోత్( Hair Growth ) అనేది అస్సలు ఉండదు.

దీని వల్ల జుట్టు రోజురోజుకు పల్చగా మారిపోతూ ఉంటుంది.ఈ సమస్యకు అడ్డుకట్ట వేయడానికి, హెయిర్ గ్రోత్ ను పెంచుకునేందుకు తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.

అయితే అలాంటి వారికి నెయ్యి( Ghee ) చాలా బాగా సహాయపడుతుంది.నెయ్యి ఆరోగ్యానికి మాత్రమే కాదు కురుల సంరక్షణకు కూడా తోడ్పడుతుంది.

మరి నెయ్యిని జుట్టుకు ఎలా ఉపయోగించాలి.? అది అందించే ప్ర‌యోజ‌నాలేంటి.

? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి.

అలాగే మూడు టేబుల్ స్పూన్లు గడ్డ పెరుగు( Curd ) మరియు వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive Oil ) లేదా ఆవ నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

40 నిమిషాల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

"""/" / వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ మాస్క్ ను వేసుకుంటే కనుక చాలా లాభాలు పొందుతారు.

నెయ్యిలో ఒమేగా -3 మరియు ఒమేగా -9 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి జుట్టు పెరుగుదలను ప్రేరేపించడంలో సహాయపడుతాయి.

నెయ్యిలోని విటమిన్లు మరియు ప్రోటీన్లు జుట్టును మూలాలను బలోపేతం చేస్తాయి.హెయిర్ ఫాల్ ను అడ్డుకుంటాయి.

కురుల‌ను ద‌ట్టంగా మారుస్తాయి. """/" / అలాగే నెయ్యిలో మెండుగా ఉండే ఫ్యాటీ యాసిడ్స్‌ జుట్టు మరియు స్కాల్ప్‌ను హైడ్రేట్ చేస్తాయి.

పొడి, చిట్లిన జుట్టును రిపేర్ చేస్తాయి.కురుల‌ను మృదువుగా, షైనీగా మెరిపిస్తాయి.

నెయ్యిలో ఉండే విట‌మిన్ ఇ( Vitamin E ) జుట్టును డీప్ కండిషన్ చేస్తాయి.

నెయ్యిలోని యాంటీ ఆక్సిడెంట్లు చుండ్రుకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ మరియు మైక్రోబియల్ ఇన్ఫెక్షన్‌లతో పోరాడుతాయి.

చుండ్ర స‌మ‌స్య‌కు స‌మ‌ర్థ‌వంతంగా చెక్ పెడ‌తాయి.

కంగువా మూవీకి జ్యోతిక రివ్యూ.. భర్త సినిమా కాకపోతే ఆమె ఇలా స్పందించేవారా?