మృదువైన మెరిసే చర్మం కోసం బనానా మాస్క్.. డోంట్ మిస్..!

చాలామందికి తమ ముఖ చర్మం ఎటువంటి మచ్చలు లేకుండా మృదువుగా కాంతివంతంగా మెరిసిపోవాలని కోరుకుంటూ ఉంటారు.అటువంటి చర్మం పొందడం కోసం రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు.

 Try This Banana Mask For Smooth And Shiny Skin Details, Smooth Skin, Shiny Skin,-TeluguStop.com

అయితే మార్కెట్లో లభ్యమయ్యే ఉత్పత్తుల వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే బనానా మాస్క్( Banana Mask ) మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది.

అదిరిపోయే బెనిఫిట్స్ ను మీ సొంతం చేస్తుంది.మరి ఇంతకీ ఆ బనానా మాస్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Almonds, Banana, Tips, Face, Healthy Skin, Latest, Milk, Saffron, Shiny S

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు బాదం గింజలు( Almonds ) వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు బాదం గింజలకు పొట్టు తొలగించి పెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో పొట్టు తొలగించిన బాదం గింజలు వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు అందులోనే ఐదు నుంచి ఆరు అరటిపండు స్లైసెస్,( Banana Slices ) చిటికెడు కుంకుమపువ్వు,( Saffron ) నాలుగైదు టేబుల్ స్పూన్లు పాలు( Milk ) వేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Almonds, Banana, Tips, Face, Healthy Skin, Latest, Milk, Saffron, Shiny S

ఇలా త‌యారు చేసుకున్న‌ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఫైనల్ గా కూల్ వాటర్ తో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ బనానా మాస్క్ ను వేసుకోవాలి.

ఈ మాస్క్ చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది.చర్మ కణాల్లో పేరుకుపోయిన మురికి, మృత కణాలను తొలగిస్తుంది.

చర్మాన్ని చాలా మృదువుగా మారుస్తుంది.

అలాగే ఈ బనానా మాస్క్ ను వేసుకోవడం వల్ల సాగిన చర్మం టైట్ గా మారుతుంది.

చర్మంపై మొండి మచ్చలు ఏమైనా ఉంటే తగు ముఖం పడతాయి.స్కిన్ సూపర్ గ్లోయింగ్ గా మరియు స్మూత్ గా మారుతుంది.కాబట్టి మృదువైన మెరిసే చర్మం కోసం ఆరాటపడేవారు ఈ బనానా మాస్క్ ను అస్సలు మిస్ అవ్వకండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube