దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో నిమ్మకాయలను విరివిగా వాడుతుంటారు.శాఖాహారం, మాంసాహారం అనే తేడా లేకుండా వివిధ రకాల వంటకాల్లో నిమ్మ రసాన్ని యాడ్ చేస్తుంటారు.
అలాగే లెమన్ వాటర్ తో తమ రోజును ప్రారంభించేవారు కూడా ఎందరో ఉన్నారు.రోజుకు ఒక నిమ్మకాయను తీసుకుంటే అనేక రోగాలకు దూరంగా ఉండొచ్చు.
అయితే నిమ్మకాయలే కాదు నిమ్మ ఆకులు కూడా ఆరోగ్యానికి తోడ్పడతాయి. నిమ్మ ఆకు( Lemon leaf )లతో హెర్బల్ టీ తయారు చేసుకుని తీసుకుంటే మస్తు లాభాలు పొందుతారు.
నిమ్మ ఆకులతో టీ తయారు చేసుకోవడం చాలా సులభం.స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ బాయిల్ అయ్యాక రెండు తాజా లేదా ఎండిన నిమ్మ ఆకులు మరియు నాలుగు లవంగాలు వేసి పది నిమిషాల పాటు మరిగిస్తే టీ రెడీ అవుతుంది.స్టవ్ ఆఫ్ చేసుకుని టీను ఫిల్టర్ చేసుకుని సేవించాలి.
నిమ్మ ఆకుల టీ మధుమేహం( Diabetes) వ్యాధితో బాధపడుతున్న వారికి ఒక వరమనే చెప్పాలి.ఎందుకంటే ఈ టీలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.రోజు ఉదయం నిమ్మ ఆకులతో టీ తయారు చేసుకుని తీసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.అలాగే నిమ్మ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ముఖ్యమైన నూనెలు ఉంటాయి.
ఇవి జీర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
నిమ్మ ఆకులతో తయారు చేసిన టీ మంచి స్ట్రెస్ బస్టర్ గా పని చేస్తుంది.ఒత్తిడిగా ఉన్నప్పుడు ఈ హెర్బల్ టీ తాగితే క్షణాల్లో రిలీఫ్ పొందుతారు.మెదడు ప్రశాంతంగా మారుస్తుంది.
నిమ్మ ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి, ఇవి కణితి పెరుగుదలను నిరోధించగలవు.అంతేకాదు నిమ్మ ఆకుల టీ ను డైట్ లో చేర్చుకుంటే రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
వివిధ చర్మ సమస్యలు( Skin problems ) దూరం అవుతాయి.మెదుడు పనితీరు మెరుగుపడుతుంది.
నిమ్మ ఆకుల్లో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ యాసిడ్లు మరియు విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్ లు శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి కి వ్యతిరేకంగా రక్షించడంలో సహాయపడతాయి.గుండె జబ్బులు మరియు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సైతం తగ్గిస్తాయి.