యాదాద్రి భువనగిరి జిల్లా: ఆత్మకూరు (ఎం) మండలం పల్లె పహాడ్ ( Palle Pahad )గ్రామానికి ఒక చరిత్ర ఉందని,తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో నైజాం రజాకర్లకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర పల్లె పహాడ్ సొంతమని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బీసు చందర్ గౌడ్ అన్నారు.శుక్రవారం పల్లె పహాడ్ గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మహిళలకు బీసు చందర్ గౌడ్,ధనలక్ష్మి దంపతులు చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతటి చరిత్ర కలిగిన ఈ గ్రామ మహిళలను గౌరవించుకోవడం మన బాధ్యత అన్నారు.గ్రామంలోని ప్రజలందరూ దసరా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కాలే మల్లేష్,మండల ప్రధాన కార్యదర్శి గజ్జల్లి శంకరయ్య,మాజీ ఎంపీటీసీ సుంకరి పరుశరాములు,మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు మిరియాల బీరయ్య, కొత్తపెళ్లి పెంటయ్య, ఏనుగు వెంకట్ రెడ్డి, సత్యనారాయణ,ఆకుల వెంకటయ్య,వడ్డెబోయిన సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.