ఏ కంపెనీ అయినా సరే వారి వస్తువులను అమ్ముకునేందుకు మార్కెటింగ్ చేయడం సహజమే.అయితే ఆ మార్కెటింగ్ చేసే పద్ధతి వల్లనే వారి ప్రొడక్ట్స్ కస్టమర్లకు రీచ్ అవ్వడం జరుగుతుంది.
ఈ నేపథ్యంలోనే అనేక సంస్థలు ప్రజలకు వారి ప్రొడక్ట్స్ కనబడేలా రోడ్లపై పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి అడ్వర్టైజ్మెంట్స్ చేయడం మనం చూస్తూ ఉంటాం.ఇకపోతే త్రీడీ బిల్ బోర్డులు ( 3D billboards )సంబంధించి మనం అడ్వర్టైజ్మెంట్లను ఇదివరకు కేవలం అమెరికా, చైనా ( America, China )లాంటి దేశాలలో చూసి ఉంటాం.
నిజానికి ఆ బిల్ బోర్డులు చూడడానికి నమ్మశక్యంగా కానీ రీతిలో ఉంటాయి.
చూడడానికి ఎంతో అబ్బురపరిచే విధంగా ఆ త్రీడీ బిల్ బోర్డు ప్రకటనలు ఉంటాయి.అయితే ఇప్పుడు అలాంటి ఓ త్రీడి బోర్డ్ ప్రకటన బెంగళూరు( Bangalore ) నగర ప్రజలను అబ్బుర పరుస్తోంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బెంగళూరు తినిడీస్ అనే రెస్టారెంట్ ఈ ప్రకటనను చేసింది.ఈ ప్రకటనలో రెస్టారెంట్ వారు వారి సంస్థకు చెందిన బ్రాంచ్లను మరో మూడు చోట్ల ప్రారంభించేందుకు సిద్ధమయ్యాము అని తెలిపే విధంగా రూపొందించారు.
ఇందులో భాగంగా ఒకటే రోజున మూడు బ్రాంచ్ల ప్రారంభోత్సవం ఉంటుందని అందులో తెలిపింది.ఫిల్టర్ కాఫీ, పొడి మసాలా ( Filter coffee, dry spice )కోసం ఎన్ని రెస్టారెంట్లు ఉన్నా సరిపోవు అని కామెంట్ కూడా అందులో ఉంది.ఇక ఈ త్రీడీ బోర్డులో వెయిటర్ కాఫీని ముందుకు వంగి అందిస్తున్నట్లుగా కనబడుతుంది.ఈ ప్రకటన చూస్తే గాలిలో అంత భారీ ఆకారంలో వెయిటర్ నిజంగానే మనకి కాఫీ సర్వ్ చేస్తున్నాడు అనుకునే విధంగా ప్రకటన జనాలను అబ్బుర పరుస్తుంది.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ మహిళల వీడియోని ఒకసారి వీక్షించండి.