బెంగళూరులో త్రీడీ బిల్ బోర్డు ప్రకటన.. నెట్టింట వైరల్
TeluguStop.com
ఏ కంపెనీ అయినా సరే వారి వస్తువులను అమ్ముకునేందుకు మార్కెటింగ్ చేయడం సహజమే.
అయితే ఆ మార్కెటింగ్ చేసే పద్ధతి వల్లనే వారి ప్రొడక్ట్స్ కస్టమర్లకు రీచ్ అవ్వడం జరుగుతుంది.
ఈ నేపథ్యంలోనే అనేక సంస్థలు ప్రజలకు వారి ప్రొడక్ట్స్ కనబడేలా రోడ్లపై పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి అడ్వర్టైజ్మెంట్స్ చేయడం మనం చూస్తూ ఉంటాం.
ఇకపోతే త్రీడీ బిల్ బోర్డులు ( 3D Billboards )సంబంధించి మనం అడ్వర్టైజ్మెంట్లను ఇదివరకు కేవలం అమెరికా, చైనా ( America, China )లాంటి దేశాలలో చూసి ఉంటాం.
నిజానికి ఆ బిల్ బోర్డులు చూడడానికి నమ్మశక్యంగా కానీ రీతిలో ఉంటాయి. """/" /
చూడడానికి ఎంతో అబ్బురపరిచే విధంగా ఆ త్రీడీ బిల్ బోర్డు ప్రకటనలు ఉంటాయి.
అయితే ఇప్పుడు అలాంటి ఓ త్రీడి బోర్డ్ ప్రకటన బెంగళూరు( Bangalore ) నగర ప్రజలను అబ్బుర పరుస్తోంది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.బెంగళూరు తినిడీస్ అనే రెస్టారెంట్ ఈ ప్రకటనను చేసింది.
ఈ ప్రకటనలో రెస్టారెంట్ వారు వారి సంస్థకు చెందిన బ్రాంచ్లను మరో మూడు చోట్ల ప్రారంభించేందుకు సిద్ధమయ్యాము అని తెలిపే విధంగా రూపొందించారు.
"""/" /
ఇందులో భాగంగా ఒకటే రోజున మూడు బ్రాంచ్ల ప్రారంభోత్సవం ఉంటుందని అందులో తెలిపింది.
ఫిల్టర్ కాఫీ, పొడి మసాలా ( Filter Coffee, Dry Spice )కోసం ఎన్ని రెస్టారెంట్లు ఉన్నా సరిపోవు అని కామెంట్ కూడా అందులో ఉంది.
ఇక ఈ త్రీడీ బోర్డులో వెయిటర్ కాఫీని ముందుకు వంగి అందిస్తున్నట్లుగా కనబడుతుంది.
ఈ ప్రకటన చూస్తే గాలిలో అంత భారీ ఆకారంలో వెయిటర్ నిజంగానే మనకి కాఫీ సర్వ్ చేస్తున్నాడు అనుకునే విధంగా ప్రకటన జనాలను అబ్బుర పరుస్తుంది.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ మహిళల వీడియోని ఒకసారి వీక్షించండి.
Lorem Ipsum Dolor Sit Amet