ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లు టాలెంట్ ఉన్నప్పటికీ ఫేడ్ అవుతూ పక్కకు తప్పుకుంటున్నారు.పెద్ద హీరోలే కావాలి.
పాన్ ఇండియా సినిమానే కావాలని చూస్తున్న పెద్ద దర్శకులు కొంతమంది ఉన్నారు.ఇక ఒకప్పుడు బ్లాక్ బసర్లు ఇచ్చిన వివి వినాయక్ ఇక ఇప్పుడు రిటైర్ అయిపోయినట్లే అని చెప్పాలి.
అలాగే శ్రీకాంత్ అడ్డాల, పూరి జగన్నాధ్, హరీష్ శంకర్( Harish Shankar ) రెండు డిజాస్టర్లతో బెంచ్ మీదకు వచ్చేసారు.హరీష్ శంకర్ కు ఉస్తాద్ సినిమా ఉంది.
ఆ సినిమా హిట్ కొడితే హరీష్ బౌన్స్ బ్యాక్ కావచ్చు.
లేదంటే హరీష్ కూడా బెంచ్ మీదకు ఎక్కాల్సిందే.ఇక పూరి జగన్నాధ్ కు అది కూడా లేదు.శ్రీకాంత్ అడ్డాల మంచి దర్శకుడు.
కానీ ఫ్లాప్ కారణంగా చేతిలోకి సినిమా రావడం లేదు.విషయం వుంది.
హిట్ వుంది.అయినా వంశీ పైడిపల్లి ఎందుకో సినిమాలే చేయడం లేదు.
ఆహా పనులకే పరిమితం అయిపోయినట్లు తెలుస్తోంది.క్రిష్ లాంటి మంచి దర్శకుడు హరి హర వీర మల్లుకు బలైపోయారు.
చేతిలో సినిమా లేదు.నందినీ రెడ్డి లాంటి క్లాస్ డైరక్టర్ ఒక ఫ్లాపు కారణంగా బెంచ్ మీదకు వచ్చేసారు.
విక్రమ్ కే కుమార్ (Vikram K Kumar )లాంటి వెర్సటాలిటీ వున్న దర్శకుడు వెబ్ సిరీస్ కు పరిమితం అయిపోయారు.మహి రాఘవ కూడా అదే రూటులో వెళ్లిపోతున్నారు.
ఆనందో బ్రహ్మ లాంటి మంచి హర్రర్ కామెడీ అందించిన సంగతి తెలిసిందే.అలాగే శివనిర్వాణ( Shiva Nirvana )కు మంచి హిట్ లు వున్నాయి.కానీ ఖుషీ తరువాత సినిమా చేతిలోకి రాలేదు.వీరంతా కాకుండా ఒక మూవీ తోనే సెన్సెషన్ క్రియేట్ చేసి, కానీ సరిగ్గా అడక, మరో సినిమా చేతిలోకి తెచ్చుకోలేని వారి జాబితా పెద్దదే వుంది.
టాలెంట్ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు లేక ఈ దర్శకులు నెమ్మదిగా ఫేడ్ అవుట్ అవుతున్నారు.దానికి తోడు హీరోలు సినిమాలు అచి తూచి చేయడం, కొత్తదనం కోసం కొత్త కొత్త కథలు వెదికి, కొత్తవారికి అవకాశం ఇవ్వడం, సీనియర్ దర్శకులు అప్ డేట్ కాకుండా రొట్ట కథలు, రొట్ట సినిమాలు అందించడం వంటి అనేక కారణాల వల్ల దర్శకులు సినిమాలు చేయడం లేదు.