మోక్షజ్ఞ మూవీ మొదలుకాకుండానే భారీ టార్గెట్ ఫిక్స్.. ఆ లక్ష్యాన్ని సాధిస్తారా?

గత కొద్ది రోజులుగా నందమూరి బాలయ్య బాబు తనయుడు మోక్షజ్ఞ( Mokshagna) పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే.మోక్షజ్ఞ ఎంట్రీకీ సంబంధించి అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.

 Mokshagna Teja Movie Date Soon, Prashanth Varma, Mokshagna, New Movie, Updat-TeluguStop.com

కానీ గడిచిన వారం రోజులుగా ఈ వార్తలు మరింత జోరుగా వినిపిస్తున్నాయి.ఇటీవల కాలంలో మోక్షజ్ఞ లుక్ పూర్తిగా మారిపోవడంతో హీరోగా ఎంట్రీ ఇవ్వడం పక్కా అని తెలుస్తోంది.

దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు మోక్షజ్ఞ.ఇప్పటికే ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసేసారు ప్రశాంత్ వర్మ.

ఈ మూవీ షూటింగ్ మూడు నెలల్లో మొదలవుతుందని బాలకృష్ణ రీసెంట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

Telugu Balakrishna, Mokshagna, Prashant Varma, Prashanth Varma, Tollywood-Movie

ఇదిలా ఉంటే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.ప్రశాంత్ వర్మ ( Prashant Verma )సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే సూపర్ హీరో స్టోరీతో ఈ సినిమా సిద్ధం కాబోతుందట.అభిమన్యుడి క్యారెక్టర్ స్ఫూర్తితో ప్రశాంత్ వర్మ ఈ మూవీ కథని సిద్ధం చేసారట.

ఇదిలా ఉంటే ఈ నెల 6న మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అఫీషియల్ గా లాంచ్ కాబోతోందని సమాచారం.రామకృష్ణ స్టూడియోస్ లో ఈ సినిమా ప్రారంభోత్సవం గ్రాండ్ గా జరగబోతోందంట.

ఇప్పటికే దానికి సంబందించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి( Sudhakar Cherukuri ) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా ప్రశాంత్ వర్మ ఈ సినిమా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ తో వీలైనంత వేగంగా కంప్లీట్ చేయడానికి రెడీ అయ్యాడట.

Telugu Balakrishna, Mokshagna, Prashant Varma, Prashanth Varma, Tollywood-Movie

మూవీ రిలీజ్ డేట్ పై కూడా ఎనౌన్స్ రోజే క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉందట.2025 దసరాకి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.ఎలాగూ ఏడాది సమయం ఉంది.

ఆరు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకొని మరో ఆరు నెలలు పోస్ట్ ప్రొడక్షన్, సీజీ వర్క్ కి సమయం సరిపోతుంది.అందుకే ఏడాదిలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేలా ప్రశాంత్ వర్మ ప్లాన్ చేసుకున్నాడట.

ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ చేయబోయే సినిమా ఎలా ఉండబోతోందనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఇప్పుడు నందమూరి అభిమానుల్లో ఉంది.మరి ప్రశాంత్ వర్మ తన లక్ష్యాన్ని సాధిస్తారో లేదో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube