ఎంత పల్చటి జుట్టు అయినా సరే ఇలా చేశారంటే రెండు నెలల్లో దట్టంగా మారుతుంది!

కొందరిలో హెయిర్ గ్రోత్( Hair Growth ) అనేది సరిగ్గా ఉండదు.దీని వల్ల ఊడే జుట్టు ఊడిపోతుంది.

 This Homemade Tonic Improves Hair Growth Naturally Details, Homemade Tonic, Hai-TeluguStop.com

కానీ కొత్త జుట్టు మొలవదు.ఫలితంగా కురులు పల్చగా( Thin Hair ) మారిపోతూ ఉంటాయి.

పచ్చడి జుట్టు కారణంగా సతమతమవుతున్న వారు మన చుట్టూ ఎంతో మంది ఉంటారు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ హెయిర్ టానిక్ ఉత్తమంగా సహాయపడుతుంది.

వారానికి ఒకసారి ఈ టానిక్ ను కనుక వాడితే రెండు నెలల్లో మీ జుట్టు దట్టంగా మారుతుంది.మరి ఇంతకీ ఆ హెయిర్ టానిక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Biryani, Ginger, Care, Care Tips, Fall, Tonic, Healthy, Homemade Tonic, T

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి.అలాగే నాలుగు బిర్యానీ ఆకులు( Biryani Leaves ) వేసి పది నిమిషాల పాటు బాగా మరిగించి వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఒక క‌ప్పు ఉల్లిపాయ ముక్కలు,( Onion ) రెండు టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని జ్యూస్ సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ ఉల్లి అల్లం జ్యూస్ లో బిర్యానీ ఆకులు వేసి మరిగించిన వాటర్ తో పాటు వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేస్తే మన హెయిర్ టానిక్ అనేది సిద్ధమవుతుంది.

Telugu Biryani, Ginger, Care, Care Tips, Fall, Tonic, Healthy, Homemade Tonic, T

ఈ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి కనీసం 10 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ విధంగా చేయడం వల్ల నెత్తి మీద రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.హెయిర్ గ్రోత్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది.మీ పల్చటి జుట్టు కొద్ది రోజుల్లోనే దట్టంగా మారుతుంది.హెయిర్ ఫాల్ సమస్య దూరం అవుతుంది.

అలాగే ఈ హోమ్ మేడ్ టానిక్ పొడవైన, బలమైన జుట్టును ప్రోత్సహిస్తుంది.ఈ టానిక్ లోని యాంటీ మైక్రోబయల్ మరియు యాంటిసెప్టిక్ లక్షణాలు శిరోజాలను శుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

చుండ్రు స‌మ‌స్య‌ల‌ను సైతం నివారిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube