ఎంత పల్చటి జుట్టు అయినా సరే ఇలా చేశారంటే రెండు నెలల్లో దట్టంగా మారుతుంది!

కొందరిలో హెయిర్ గ్రోత్( Hair Growth ) అనేది సరిగ్గా ఉండదు.దీని వల్ల ఊడే జుట్టు ఊడిపోతుంది.

కానీ కొత్త జుట్టు మొలవదు.ఫలితంగా కురులు పల్చగా( Thin Hair ) మారిపోతూ ఉంటాయి.

పచ్చడి జుట్టు కారణంగా సతమతమవుతున్న వారు మన చుట్టూ ఎంతో మంది ఉంటారు.

అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ హెయిర్ టానిక్ ఉత్తమంగా సహాయపడుతుంది.

వారానికి ఒకసారి ఈ టానిక్ ను కనుక వాడితే రెండు నెలల్లో మీ జుట్టు దట్టంగా మారుతుంది.

మరి ఇంతకీ ఆ హెయిర్ టానిక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

"""/" / ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

అలాగే నాలుగు బిర్యానీ ఆకులు( Biryani Leaves ) వేసి పది నిమిషాల పాటు బాగా మరిగించి వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఒక క‌ప్పు ఉల్లిపాయ ముక్కలు,( Onion ) రెండు టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని జ్యూస్ సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ ఉల్లి అల్లం జ్యూస్ లో బిర్యానీ ఆకులు వేసి మరిగించిన వాటర్ తో పాటు వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేస్తే మన హెయిర్ టానిక్ అనేది సిద్ధమవుతుంది.

"""/" / ఈ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి కనీసం 10 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి.

గంట అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒకసారి ఈ విధంగా చేయడం వల్ల నెత్తి మీద రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

హెయిర్ గ్రోత్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది.మీ పల్చటి జుట్టు కొద్ది రోజుల్లోనే దట్టంగా మారుతుంది.

హెయిర్ ఫాల్ సమస్య దూరం అవుతుంది.అలాగే ఈ హోమ్ మేడ్ టానిక్ పొడవైన, బలమైన జుట్టును ప్రోత్సహిస్తుంది.

ఈ టానిక్ లోని యాంటీ మైక్రోబయల్ మరియు యాంటిసెప్టిక్ లక్షణాలు శిరోజాలను శుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

చుండ్రు స‌మ‌స్య‌ల‌ను సైతం నివారిస్తాయి.

వారంలో ఒక‌రోజు ఉపవాసం చేయడం వల్ల ఎటువంటి లాభాలు పొందుతారో తెలుసా?