తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తల్లీకూతుర్లు ఇద్దరూ హీరోయిన్లుగా నటించడం కామనే.కానీ వారిద్దరితో ఒకే హీరో రొమాన్స్ చేయడం అనేది చాలా అరుదు.
ఇప్పటికి తరం వాళ్లకు సారిక-శృతిహాసన్, శ్రీదేవి-జాన్వీ వంటి మదర్ డాటర్ హీరోయిన్ల డ్యూయో గురించే ఏం తెలిసే ఉంటుంది అప్పట్లో కూడా ఇలా తల్లీకూతుళ్లు సినిమాల్లో నటించారు.అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది అలానే అమ్మాజీ – జయచిత్రల గురించి.
వీళ్లు మూవీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా నటించి అడుగుపెట్టి ఆశ్చర్యపరిచారు.
జయచిత్ర( Jayachitra ) తల్లి అమ్మాజీ( Ammaji ) (జయశ్రీ అని కూడా పిలుస్తారు) తమిళ చిత్రం మహావీరన్, తెలుగు చిత్రాలు రోజులు మారై, దైవ బలం వంటి చిత్రాలలో నటించింది.
అయితే ఈ ఇద్దరితో సీనియర్ ఎన్టీఆర్( Sr NTR ) రొమాన్స్ చేసి ఓ అరుదైన రికార్డు సృష్టించారు.బహుశా టాలీవుడ్ చరిత్రలో తల్లీకూతుళ్లతో కలిసి నటించిన ఏకైక హీరో ఒక సీనియర్ ఎన్టీఆరే కావచ్చు.
జయచిత్ర 1976లో వచ్చిన “మా దైవం”( Maa Daivam ) సినిమాతో మొదటిసారిగా ఎన్టీఆర్‌తో జత కట్టింది.ఇది హిందీలో హిట్టయిన దో ఆంఖే బారా హాథ్ సినిమాకి రీమేక్.మా దైవం సినిమాని ఉదయమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మణియన్, విద్యాస్ లక్ష్మణ్ నిర్మించారు.S.S.బాలన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి హిట్ అయింది.ఇందులో జయ చిత్రా సరోజ అనే ఒక రూల్ పోషించింది ఆ పాత్రలో ఆమె వీధుల్లో తిరుగుతూ వస్తువులను అమ్ముతుంటుంది.రామారావు ఒక జైలర్ పాత్రలో కనిపించారు.
నేరస్తులను మంచి వాళ్లను చేయవచ్చు అని రామారావు నమ్ముతారు.అంతేకాదు నేరాలు చేసిన వారిని జైలుకు తీసుకొచ్చి వారిని మంచి వారిని చేసి, వారి జీవితాల్లో వెలుగు నింపుతారు.
ఇందులో కేవీ మహదేవన్ కంపోజ్ చేసిన బాల సుబ్రమణ్యం పాడిన ‘ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే’ పాట సూపర్ హిట్ అయింది.దీనికి లిరిక్స్ రాజశ్రీ అందించారు.సి నారాయణరెడ్డి రాసిన ‘మాఘమాసం మంగళవారం మామయ్యోచ్చాడు’ సాంగ్ కూడా సూపర్ హిట్ అయింది , ‘చల్లని చిరుగాలి నిన్నొక సంగతి అడగాలి’ పాట చాలా మెలోడియస్ గా సాగుతుంది.
అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ రొమాన్స్ చేశారు కదా, దానికంటే ముందు “దైవ బలం (1959)”లో( Daiva Balam ) జయచిత్ర తల్లి జయశ్రీతో( Jayasri ) ఎన్టీఆర్ జత కట్టారు.
ఈ సినిమాని పొన్నలూరు వసంతకుమార్ రెడ్డి నిర్మించి, దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా, జయశ్రీ హీరోయిన్ గా నటించారు.ప్రముఖ సంగీత దర్శకుడు అశ్వత్థామ ఈ సినిమాకు సంగీతం అందించారు.ఇది తెలుగు సినిమాల్లో ఈస్ట్‌మాన్ కలర్ అనే కొత్త రకం కలర్ ఫోటోగ్రఫీని మొదటిసారిగా ఉపయోగించిన సినిమాలలో ఒకటి కావడం విశేషం.
అంతేకాకుండా, ఈ సినిమా శోభన్ బాబు కెరీర్‌లో మొదటి సినిమా కావడం మరో విశేషం.