వీడియో: ఎయిర్‌పోర్ట్‌లో హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడు.. జవాన్ ఎంట్రీ ఇవ్వడంతో..?

ఇటీవల కాలంలో చాలా మంది ప్రజలు గుండెపోటు( Heart Attack ) కారణంగా చనిపోతున్నారు.పెద్దవారే కాకుండా టీనేజ్ వయసులో ఉన్న వారికి కూడా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి.

 Man Collapses Due To Cardiac Arrest At Delhi Airport Cisf Officer Cpr Saves Him-TeluguStop.com

వీరు హెల్తీ పర్సన్స్ అయినా సడన్‌గా గుండె ఆగిపోవడం, నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు పోవడం జరుగుతోంది.డ్యాన్స్, వ్యాయామం, యోగా, నార్మల్ వాకింగ్ చేసే వ్యక్తులకు కూడా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి.

దీనికి కారణం ఏమై ఉంటుందో డాక్టర్లు కూడా కనిపెట్టలేక పోతున్నారు.ఈ నేపథ్యంలో ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో( Delhi Indira Gandhi International Airport ) ఇలాంటి మరో సంఘటన చోటు చేసుకుంది.

ఇక్కడ రెండవ టర్మినల్‌లో అర్షిద్ అయూబ్( Arshid Ayoub ) అనే వ్యక్తి శ్రీనగర్‌కు వెళ్లే విమానాన్ని ఎక్కేందుకు సిద్ధమవుతుండగా గుండె ఆగిపోయింది.అతడు హార్ట్ ఎటాక్ వచ్చి అకస్మాత్తుగా కుప్పకూలాడు.

ఇది గమనించిన ఒక సీఐఎస్‌ఎఫ్ జవాన్ వెంటనే సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.హార్ట్ బీట్ ఆగిపోయిన వ్యక్తికి కార్డియో పల్మనరీ రిసససిటేషన్ (సీపీఆర్) చేసి ఆయన ప్రాణాలను కాపాడారు.

దీన్నే కార్డియాక్ అరెస్ట్ అంటారు.ఆగస్టు 21న ఈ సంఘటన జరిగింది.

దీని గురించి సీఐఎస్‌ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) ఓ ప్రకటన రిలీజ్ చేసింది.“సీఐఎస్‌ఎఫ్ బృందం వెంటనే స్పందించి ప్యాసింజర్‌కు సీపీఆర్ చేయడం వల్ల ఆయన ప్రాణం దక్కింది” అని ఆ ప్రకటనలో పేర్కొంది.సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యం రికార్డు అయింది.ఆ వీడియోలో కనిపించినట్లు బ్యాగేజ్ ట్రాలీతో నిలబడి ఉన్న ఆయన కుప్పకూలిపోయాడు.సీఐఎస్ఎఫ్ అధికారిణి డాక్టర్ ప్రియ( CISF Officer Dr Priya ) వెంటనే ఆయనకు సహాయం చేశారు.ఆమె సీపీఆర్( CPR ) చికిత్స చేయడం ద్వారా ఆయన గుండెను మళ్లీ పని చేయించారు.

ప్రస్తుతం అర్షిద్ అయూబ్ ఢిల్లీ సఫదర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని తెలుస్తోంది.

డాక్టర్ ప్రియా అమర్‌నాథ్ యాత్ర నుంచి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది.డాక్టర్ ప్రియ తమ అనుభవాలను పంచుకుంటూ, “దేవుడికి మించిన శక్తి ఎవరికీ లేదు కానీ ఈ వ్యక్తి ప్రాణం దక్కడానికి ప్రధాన కారణం సమయానికి చేసిన సీపీఆర్ చికిత్సే.ఇది మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పుతుంది.అంటే, ఎప్పుడైనా ఎవరికైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే వైద్య సహాయం అందించడం చాలా ముఖ్యం” అని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube