ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) పుష్ప ది రూల్ కోసం ఏకంగా మూడు సంవత్సరాల సమయం కేటాయించారు.ఒక హీరో సినిమా కోసం ఇన్నేళ్ల సమయం కేటాయించారంటే ఆ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ ఏడాది డిసెంబర్ నెల 6వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఏ మాత్రం మార్పు లేదని తెలుస్తోంది.
అయితే ఈ సినిమా కోసం మొదట గడ్డం పెంచిన బన్నీ కొన్నిరోజుల క్రితం విదేశాలకు వెళ్లే సమయంలో వేరే లుక్ లో కనిపించారు.ప్రస్తుతం పుష్ప ది రూల్( Pushpa The Rule ) క్లైమాక్స్ జరుగుతుండగా పెట్టుడు గడ్డంతో ఈ సినిమా షూటింగ్ జరిగిందని తెలుస్తోంది.
ఈ గడ్డం ఖరీదు ఏకంగా 40 లక్షల రూపాయలు అని సమాచారం అందుతోంది.ముంబై నుంచి ప్రత్యేకంగా నిపుణులు వచ్చారని తెలుస్తోంది.
బన్నీ గడ్డం( Allu Arjun Beard ) కోసమే ఇంత ఖర్చు చేశారంటే పుష్ప ది రూల్ మూవీ కోసం ఏ స్థాయిలో ఖర్చై ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటంతో బడ్జెట్ విషయంలో మేకర్స్ కు ఎలాంటి సమస్య లేదని తెలుస్తోంది.పుష్ప ది రూల్ మూవీ డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం కాగా నెట్ ఫ్లిక్స్ ఇందుకోసం భారీ మొత్తం ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.
పుష్ప ది రూల్ మూవీ థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.బన్నీపై కొంతమేర నెగిటివిటీ పెరుగుతున్న నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప 2 రిలీజ్ సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.