చివరి భూములకు సాగునీరు అందేలా కృషి:ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి

నల్లగొండ జిల్లా: నీటిపారుదల కాల్వాలు, కుంటలలో పేరుకుపోయిన కంపచెట్లు పిచ్చి మొక్కలు వ్యర్ధాలను తొలగించి కాలువ చివరి భూముల వరకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి అన్నారు.ఎమ్మెల్యే సొంత నిధులతో నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని మాడ్గులపల్లి మండలం ధర్మపురం గ్రామ సమీపంలోని డి-37, ఆర్-24 సాగునీటి కాలువల్లో పేరుకుపోయిన కంపచెట్లు,పిచ్చి మొక్కలు వ్యర్ధాలను తొలగించే పనులను శనివారం ప్రారంభించారు.

 Efforts To Irrigate The Lands Mla Kunduru Jayaveer Reddy, Irrigate The Lands ,m-TeluguStop.com

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల అభివృద్ధి,సంక్షేమమే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వ ధ్యేయమన్నారు.

దీనికి నిదర్శనమే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ.70 వేల కోట్ల నిధుల కేటాయింపు అని గుర్తు చేశారు.ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు రూ.31వేల కోట్లు వ్యవసాయ రుణాలను మాఫీ చేసి మాట నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వమన్నారు.నల్లగొండ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ఎస్ఎల్బీసితో పాటు అన్ని సాగునీటి ప్రాజెక్టులను రానున్న మూడేళ్ల కాలంలో పూర్తిచేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం వేణుగోపాల్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు పుల్లెంల నరసింహ,మల్లె లింగారెడ్డి,బట్టు మాధవరెడ్డి,మాజీ ఎంపీటీసీ కొత్త దశరథ, బోడ యాదయ్య,చింతరెడ్డి భాస్కర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube