విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా: విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 Students Should Be Trained In All Fields, Students , Rajanna Sircilla District,-TeluguStop.com

ఈ సందర్భంగా విద్యాలయం ఆవరణ, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, డైనింగ్ హాల్ ను పరిశీలించారు.విద్యాలయంలో ఎందరు విద్యార్థులు చదువుతున్నారని అడగగా, 248 మంది విద్యార్థులు ఉన్నారని, 35 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారని ప్రిన్సిపాల్ పద్మ తెలిపారు.

అనంతరం మెనూను పరిశీలించి, కిచెన్ లో సిద్ధం చేస్తున్న అన్నం, కూర ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా తరగతి గదుల్లోకి వెళ్లి ఫ్యాన్లు, విద్యుత్ దీపాల పనితీరును పరిశీలించారు.

పలువురు విద్యార్థులతో పాఠ్యాంశాలు చదివించారు.వారికి పలు ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడారు.విద్యార్థులను పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా సిద్ధం చేయాలని, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఇతర సబ్జెక్టుల్లో రాణించేలా తర్ఫీదు ఇవ్వాలని ఆదేశించారు.

విద్యాలయం ఆవరణలో టాయిలెట్స్, నల్లాలు, సీపేజ్ సమస్యలను ప్రిన్సిపాల్ వివరించారు.ఇక్కడ డీఈఓ రమేష్ కుమార్, విద్యాలయం టీచర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube