ఇదేందయ్యా ఇది.. కడుతుండగానే మూడోసారి కూలిపోయిన వంతెన..

తాజాగా బీహార్( Bihar ) రాష్ట్రంలోని గంగానది నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.వాస్తవానికి ఇదేమీ మొదటిసారి ఏమీ కాదు.

 Sultanganj Aguwani Ghat Bridge Collapsed For The Third Time While Being Washed-TeluguStop.com

ఇప్పటికే రెండుసార్లు కుప్పకూలినట్లు తెలుస్తుంది.అయితే తాజాగా నేడు ఉదయం కూడా ఈ వంతెన కూలిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

అయితే, ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలియజేశారు.సంవత్సరాలుగా నిర్మాణం చేపడుతున్న ఈ వంతెన కూలిపోవడం అందరిని అనేక సందేహాలకు దారితీస్తూ ఉంది.

అయితే ఇటీవల బీహార్ లో నాలుగు వారాలలో 15 వంతెనలు కుప్పకూలిపోయాయి.అయితే భాగల్పూర్ వైపున ఉన్న వంతెన యొక్క మరొక భాగం జూన్ 30, 2022 న కుప్పకూలింది.స్తంభాల సంఖ్య 5 మరియు 6 మధ్య ఉన్న వంతెన గంగా నదిలో ఒక్క సారిగా పడిపోయింది.అలాగే జూన్ 4, 2023న కూడా వంతెన కూలిపోయింది.

ముఖ్యమైన లోపాలు, నిర్మాణ నాణ్యతను బహిర్గతం చేస్తునట్టు సమాచారం.ఖగారియా వైపు స్తంభాల సంఖ్య 10 – 12 మధ్య కూలిపోవడం బీహార్ అధికారులకు పెద్ద సమస్యగా మారింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా చెక్కర్లు కొడుతూ ఉంది.అయితే ఈ సంఘటనకు సంబంధించి SK సింగ్లా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఎటువంటి వివరణ ఇవ్వలేదని తెలుస్తుంది.అయితే వాస్తవానికి ఆ ప్రాంతంలో ఉండే ట్రాఫిక్ జాం రద్దీని తగ్గించాలని భావనతోనే ఈ వంతెన నిర్మాణం చేపట్టారు.కానీ., పదే పదే ఇలా బ్రిడ్జి కూలిపోవడం అధికారులకు పెద్ద సమస్య అయ్యింది.ఇక ఇప్పటికే బీహార్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కొరకు రూ.1,710 కోట్లు కేటాయించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube