ఇదేందయ్యా ఇది.. కడుతుండగానే మూడోసారి కూలిపోయిన వంతెన..

తాజాగా బీహార్( Bihar ) రాష్ట్రంలోని గంగానది నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

వాస్తవానికి ఇదేమీ మొదటిసారి ఏమీ కాదు.ఇప్పటికే రెండుసార్లు కుప్పకూలినట్లు తెలుస్తుంది.

అయితే తాజాగా నేడు ఉదయం కూడా ఈ వంతెన కూలిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

అయితే, ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలియజేశారు.సంవత్సరాలుగా నిర్మాణం చేపడుతున్న ఈ వంతెన కూలిపోవడం అందరిని అనేక సందేహాలకు దారితీస్తూ ఉంది.

"""/" / అయితే ఇటీవల బీహార్ లో నాలుగు వారాలలో 15 వంతెనలు కుప్పకూలిపోయాయి.

అయితే భాగల్పూర్ వైపున ఉన్న వంతెన యొక్క మరొక భాగం జూన్ 30, 2022 న కుప్పకూలింది.

స్తంభాల సంఖ్య 5 మరియు 6 మధ్య ఉన్న వంతెన గంగా నదిలో ఒక్క సారిగా పడిపోయింది.

అలాగే జూన్ 4, 2023న కూడా వంతెన కూలిపోయింది.ముఖ్యమైన లోపాలు, నిర్మాణ నాణ్యతను బహిర్గతం చేస్తునట్టు సమాచారం.

ఖగారియా వైపు స్తంభాల సంఖ్య 10 - 12 మధ్య కూలిపోవడం బీహార్ అధికారులకు పెద్ద సమస్యగా మారింది.

"""/" / ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా( Social Media )లో వైరల్ గా చెక్కర్లు కొడుతూ ఉంది.

అయితే ఈ సంఘటనకు సంబంధించి SK సింగ్లా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఎటువంటి వివరణ ఇవ్వలేదని తెలుస్తుంది.

అయితే వాస్తవానికి ఆ ప్రాంతంలో ఉండే ట్రాఫిక్ జాం రద్దీని తగ్గించాలని భావనతోనే ఈ వంతెన నిర్మాణం చేపట్టారు.

కానీ., పదే పదే ఇలా బ్రిడ్జి కూలిపోవడం అధికారులకు పెద్ద సమస్య అయ్యింది.

ఇక ఇప్పటికే బీహార్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కొరకు రూ.1,710 కోట్లు కేటాయించింది.

పాముతో పరాచకాలాడిన కోతి.. చివరకి?