మరో 40 రోజుల్లో థియేటర్లలో విడుదల కానున్న దేవర ( Deavara )సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈరోజు సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali Khan )పుట్టిన రోజు కాగా దేవర సినిమా నుంచి సైఫ్ అలీ ఖాన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది.
కేవలం 52 సెకన్లు మాత్రమే ఉన్న గ్లింప్స్ అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంది.యూట్యూబ్లో ఈ గ్లింప్స్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.
క్రూరమైన విలన్ రోల్ లో సైఫ్ అలీ ఖాన్ అదరగొట్టాడు.
దేవర సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై అంచనాలను పెంచేయగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనే నమ్మకం ప్రేక్షకులకు కలుగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను దేవర సినిమాతో ఎంటర్టైన్ చేయడం పక్కా అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.ఈ సినిమా నుంచి విడుదలైన చుట్టమల్లే సాంగ్ రికార్డ్ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంటోంది.
ఈ సాంగ్ తెలుగు వర్షన్ కు కేవలం పది రోజుల్లో దాదాపుగా 70 మిలియన్ల వ్యూస్ వచ్చాయంటే ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతలా మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు.
జాన్వి కపూర్ ( Janhvi Kapoor )తెలుగులో నటిస్తున్న తొలి సినిమా దేవర కాగా ఈ సినిమా ఆమె కెరీర్లో స్పెషల్ మూవీ గా నిలిచిపోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ సినిమాలో తంగం అనే పాత్రలో జాన్వీ కపూర్ కనిపించనుండగా ఆమె సినిమాలో ఒకింత గ్లామరస్ గానే కనిపించనున్నారు.ఎన్టీఆర్, జాన్వి కపూర్ కెమిస్ట్రీ అదుర్స్ అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
త్వరలో దేవర సినిమా నుంచి థర్డ్ సింగిల్ విడుదల కానుంది.
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ( Star Director Koratala Siva ) ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని చెప్పవచ్చు.ఆచార్య సినిమాతో విమర్శల పాలైన కొరటాల శివ ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని అర్థమవుతోంది.రాజమౌళి నెగిటివ్ సెంటిమెంట్ తో పాటు మరిన్ని నెగటివ్ సెంటిమెంట్లను బ్రేక్ చేసే సినిమా దేవర అవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు.
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారని తెలుస్తోంది.