ఈ టిప్ ను ఫాలో అయితే ముడతలు మీ వంక కన్నెత్తి కూడా చూడవు!

ఇటీవల రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే ముడుతల సమస్యతో బాధపడుతున్నారు.రసాయనాలు నిండి ఉన్న చర్మ ఉత్పత్తులను వాడటం, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, ఒత్తిడి తదితర కారణాల వల్ల కొందరిలో స్కిన్ ఏజింగ్ అనేది చాలా తొందరగా మొదలవుతుంది.

 Follow This Tip To Avoid Wrinkles! Wrinkles, Wrinkle Free Skin, Home Remedy, Sim-TeluguStop.com

ఫలితంగా ముడతలు, చారలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య లక్షణాలు ముఖంలో కొట్టొచ్చినట్లు కనపడుతుంటాయి.అందుకే స్కిన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు.

సమస్య వచ్చాక బాధపడడం కన్నా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు అని సూచిస్తున్నారు.

Telugu Tips, Remedy, Latest, Simple Tip, Skin Care, Skin Care Tips, Wrinkle Skin

ఇకపోతే వయసు పైబడిన కూడా యవ్వనంగా మెరిసిపోతూ కనిపించాలని భావించే వారికి ఇప్పుడు చెప్పబోయే టిప్ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ టిప్ ను పాటిస్తే ముడతలు మీ వంక కన్నెత్తి కూడా చూడవు.అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Almond Oil ) వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ బియ్యం కడిగిన వాటర్, రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్( Aloe Vera Gel ) వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి.

Telugu Tips, Remedy, Latest, Simple Tip, Skin Care, Skin Care Tips, Wrinkle Skin

ఇప్పుడు ఫేస్ ను వాటర్ తో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.ఆ తర్వాత తయారు చేసుకున్న‌ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి కనీసం 10 నిమిషాల పాటు మంచిగా మసాజ్ చేసుకోవాలి.మరో 10 నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకుని అప్పుడు తడి క్లాత్ తో క్లీన్ చేసుకోవాలి.

వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ సింపుల్ టిప్ ను కనుక ఫాలో అయ్యారంటే ముఖ కండరాలు బిగుతుగా మారతాయి.ముడతలు, చారలు, చర్మం సాగటం వంటి సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

ఫేస్ సూపర్ గ్లోయింగ్ గా మరియు స్మూత్ గా మారుతుంది.స్కిన్ టైట్ అవుతుంది.

ఏజింగ్ ప్రాసెస్ ఆలస్యం అవుతుంది.ఏజ్ పెరుగుతున్న కూడా మీరు యంగ్ గా కనిపిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube