ఈ టిప్ ను ఫాలో అయితే ముడతలు మీ వంక కన్నెత్తి కూడా చూడవు!

ఇటీవల రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే ముడుతల సమస్యతో బాధపడుతున్నారు.రసాయనాలు నిండి ఉన్న చర్మ ఉత్పత్తులను వాడటం, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, ఒత్తిడి తదితర కారణాల వల్ల కొందరిలో స్కిన్ ఏజింగ్ అనేది చాలా తొందరగా మొదలవుతుంది.

ఫలితంగా ముడతలు, చారలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య లక్షణాలు ముఖంలో కొట్టొచ్చినట్లు కనపడుతుంటాయి.

అందుకే స్కిన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు.సమస్య వచ్చాక బాధపడడం కన్నా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు అని సూచిస్తున్నారు.

"""/" / ఇకపోతే వయసు పైబడిన కూడా యవ్వనంగా మెరిసిపోతూ కనిపించాలని భావించే వారికి ఇప్పుడు చెప్పబోయే టిప్ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.

ఈ టిప్ ను పాటిస్తే ముడతలు మీ వంక కన్నెత్తి కూడా చూడవు.

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Almond Oil ) వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ బియ్యం కడిగిన వాటర్, రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్( Aloe Vera Gel ) వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి.

"""/" / ఇప్పుడు ఫేస్ ను వాటర్ తో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.

ఆ తర్వాత తయారు చేసుకున్న‌ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి కనీసం 10 నిమిషాల పాటు మంచిగా మసాజ్ చేసుకోవాలి.

మరో 10 నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకుని అప్పుడు తడి క్లాత్ తో క్లీన్ చేసుకోవాలి.

వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ సింపుల్ టిప్ ను కనుక ఫాలో అయ్యారంటే ముఖ కండరాలు బిగుతుగా మారతాయి.

ముడతలు, చారలు, చర్మం సాగటం వంటి సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.ఫేస్ సూపర్ గ్లోయింగ్ గా మరియు స్మూత్ గా మారుతుంది.

స్కిన్ టైట్ అవుతుంది.ఏజింగ్ ప్రాసెస్ ఆలస్యం అవుతుంది.

ఏజ్ పెరుగుతున్న కూడా మీరు యంగ్ గా కనిపిస్తారు.

భారతదేశంలో భరించలేని పరిస్థితులు.. జపనీస్ టూరిస్ట్ కన్నీటి పర్యంతం!