సాధారణంగా యాక్టర్స్ అనేవారు ఓన్లీ యాక్టింగ్‌కే పరిమితం కారు.దర్శకులుగానూ మారుతారు.
కొందరు ప్రొడ్యూసర్లు కూడా అవుతారు.అయితే మరిన్ని టాలెంట్స్ ఉంటే సింగర్లు, స్టోరీ, స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే రైటర్స్ గా కూడా మారుతుంటారు.
భారతదేశంలో కొందరి నటీనటులు మూవీ రైటర్స్‌గా మారారు.ఉదాహరణకు “దిల్ చాహ్తా హై“, డాన్, రాక్ ఆన్, జిందగీ నా మిలేగీ దొబారా వంటి సినిమాలకు యాక్టర్ ఫర్హాన్ అక్తర్ స్క్రిప్ట్ అందించాడు.
అజయ్ దేవగన్ ముగ్గురు రచయితలతో కలిసి తన తొలి చిత్రం “యు మీ ఔర్ హమ్” స్టోరీ రాసి ఆశ్చర్యపరిచాడు.ధనుష్ కూడా ఒక స్టోరీ రైటర్ గా అవతరించాడు.
వీళ్లు మాత్రమే కాదు టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా స్టోరీ రైటర్స్ గా మారి వావ్ అనిపించారు.త్వరలోనే మరో ముగ్గురు టాలీవుడ్ హీరోలు సినిమా రచయితలుగా మారనున్నారు.
వారు ఎవరో తెలుసుకుందాం.
అల్లరి నరేష్
భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో 2012లో వచ్చిన పేరడీ మూవీ “సుడిగాడు( Sudigaadu )” సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ నటించారు.జస్ట్ రూ.7 కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా రూ.32 కోట్లు వసూలు చేసి సంచలన విజయం సాధించింది.అయితే ఈ సినిమాకి ఒక సీక్వెల్ చేయాలని అల్లరి నరేష్ భావిస్తున్నాడు.అంతేకాదు దీనికి తానే సొంతంగా స్టోరీ రాయడానికి సిద్ధమయ్యాడు.ఈ మూవీతో అల్లరి నరేష్ మూవీ రచయిత అయిపోనున్నాడు.ఈ సినిమాలో అల్లరి నరేష్ హీరోగా చేయనున్నాడు.
హీరో నాని
తెలుగులో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ హిట్ బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.ఇప్పటికే హిట్: ఫస్ట్ కేసు, హిట్: సెకండ్ కేసు సినిమాలు వచ్చాయి.మొదటి మూవీలో విశ్వక్ సేన్, రుహాని శర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. శైలేష్ కొలను ఫస్ట్, సెకండ్ సినిమాలను డైరెక్ట్ చేశాడు.ఈ రెండింటికి స్టోరీ కూడా అతనే రాశాడు. హిట్ 3 ( HIT 3 )సినిమా కూడా ప్రకటించారు.
కానీ దీనికి స్టోరీ రాసేది మాత్రం హీరో నాని కావడం విశేషం.ఇప్పటిదాకా ఈ రెండు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ వచ్చాడు ఇప్పుడు మూడో సినిమాకి రచయిత కూడా కాబోతున్నాడు.ఇందులో నాని హీరోగా నటించే అవకాశం ఉంది.
గూఢచారి 2
అడవి శేషు( Adivi Sesh ) గూఢచారి సినిమాకి కథ రాశాడు.త్వరలో రాబోతున్న గూఢచారి 2 సినిమాకి కూడా ఆయనే కథ అందిస్తున్నాడు.