స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి: కలెక్టర్

సూర్యాపేట జిల్లా: స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామాలలో,పట్టణాలలో దోమల ద్వారా వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.బుధవారం సూర్యాపేట జిల్లా చివ్వేంలలో స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని రైతు వేదిక ఆవరణలో మొక్కను నాటారు.

 Everyone Should Participate In The Cleanliness-greenness Programme Collector, C-TeluguStop.com

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వీధులు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాలు పరిశుభ్రంగా ఉంచుకొవాలని,రోడ్ల మీద గుంటల్లో నీరు నిల్వ ఉండి దోమలు చేరుతాయని,వాటి ద్వారా డెంగ్యూ, మలేరియా వ్యాధులు వ్యాపిస్తాయని,రోడ్ల మీద గుంటలను రాళ్ళ మిశ్రమంతో పూడ్చాలని అధికారులకు సూచించారు.

ఎక్కడైనా పరిశుభ్రంగా లేకపోయినా,గుంటలు ఉన్నా గ్రామ పంచాయతీ వారికి తెలియజేస్తే వెంటనే గుంటలను పూడ్చి పరిసరాలను పరిశుభ్రంగా చేస్తారని ప్రజలకు సూచించారు.

అంతకుముందు మండలంలో రైతు భీమా,పంట నమోదు,రైతు రుణమాఫి గురించి మండల వ్యవసాయ అధికారులతో చర్చించి,ఇంకా ఎవరైనా అర్హత ఉండి రుణమాఫి కాని రైతుల వివరాలను పై అధికారులకు, బ్యాంక్ అధికారులకు తెలియజేయాలని కోరారు.

అనంతరం ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి,వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

వారు కలెక్టర్ తో ఉపాధి హామీ కూలీ డబ్బులు జమ అవ్వటంలేదని తెలపగా వెంటనే సమస్యని పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు.తదుపరి గ్రామ పంచాయతీ సిబ్బందితో మాట్లాడుతూ జీతాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

వీధులను పరిశుభ్రంగా ఉంచాలని, మొక్కలను సంరక్షించాలని చెప్పారు.బోధకాలు వ్యాధితో బాధపడుతున్న వెంకులు, కరుణమ్మతో మాట్లాడి మండల ప్రాధమిక హాస్పిటల్ కి వెళ్ళి డాక్టర్ తో మాట్లాడి సరైన చికిత్స,మందులు ఇప్పించాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జగదీశ్ రెడ్డి, డి.ఎల్.పి.ఓ కె.నారాయణరెడ్డి,ఎంపిడి ఓ సంతోష్ కుమార్, ఎంపీఓ దయాకర,ఏపీఓ నాగయ్య,మండల వ్యవసాయ అధికారి ఆశ కుమారి, పంచాయతి కార్యదర్శి విక్రమ్, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube