తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్( Congress ) ఘనవిజయం సాధించే విషయంలో ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కానుగోలు( Sunil Kanugolu ) వ్యూహాలు బాగా కలిసి వచ్చాయి అనే విషయం అందరికీ తెలిసిందే.అసలు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే ఆశలు ఎవరికి లేకపోయినా, సునీల్ కానుగోలు రాజకీయ వ్యవహారాలు బాగా పనిచేయడం తో పాటు , తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ బాగా కలిసి వచ్చాయి.
కాంగ్రెస్ విజయం తరువాత సునీల్ కానుగోలుకు ఆ స్థాయిలోనే కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. తాజాగా సునీల్ కానుగోలుకు మరో కీలక పదవిని ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమైనట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో బీఆర్ఎస్( BRS ) దూకుడుగా వ్యవహరిస్తూ ఉండడం, మీడియా , సోషల్ మీడియాలో కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకుని ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ చేస్తున్న నెగిటివ్ ప్రచారం జనాల్లోకి వెళ్తుండడం , కాంగ్రెస్ గ్రాఫ్ క్రమ క్రమంగా తగ్గుతున్నట్లుగా సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో, సునీల్ కానుగోలుకు సోషల్ మీడియా( Social Media ) బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం .ఇటీవల అసెంబ్లీ సమావేశాలు, కరెంటు కోతలు, ఇతర అన్ని అంశాల విషయంలోనూ బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్న ఎదురుదాడి తెలంగాణ ప్రభుత్వం పై వ్యతిరేఖతను జనాల్లో పెంచుతున్నాయని గుర్తించారు.
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ డామినేట్ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తం ఆయిన నేపథ్యంలో మరింతగా కాంగ్రెస్ సోషల్ మీడియాను యాక్టివ్ చేసి బీఆర్ఎస్ బిజెపిలపై పైచేయి సాధించాలనే వ్యూహంతో సునీల్ కానుగోలుకు ఆ బాధ్యతలను అప్పగిస్తే అనుకున్న మేరకు సక్సెస్ అవుతామని కాంగ్రెస్ భావిస్తోందట.అందుకే ఈ విషయంలో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా సునీల్ పేరు ను కాంగ్రెస్ అధిష్టానం సూచనలతో పరిశీలిస్తున్నట్లు సమాచారం.