భారతీయ రోడ్లపై యాక్సిడెంట్స్ జరగడం సర్వసాధారణం.ఒక్కోసారి ఆహార వస్తువులను తరలించే లారీలు కూడా కంట్రోల్ తప్పి బోల్తా పడుతుంటాయి.
![Fish Truck Overturns In Bihar Katihar Locals Loot Them Video Viral Details, Truc Fish Truck Overturns In Bihar Katihar Locals Loot Them Video Viral Details, Truc-TeluguStop.com](https://telugustop.com/wp-content/uploads/2024/08/Fish-truck-overturns-in-Bihar-Katihar-locals-loot-them-video-viral-detailss.jpg)
తాజాగా ఒక చేపల ట్రక్కు( Fish Truck ) కింద పడిపోయింది.దీంతో చేపలను ఎత్తుకెళ్లడానికి ప్రజలు ఎగబడ్డారు.
దీనికి సంబంధించిన ఒక వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వైరల్ అవుతోంది.చేపల లోడ్‌తో వెళ్తున్న లారీ బిహార్ రాష్ట్రంలోని( Bihar ) కటిహార్ అనే చోట ఒక బోల్తా పడింది.
వైరల్ వీడియోలో( Viral Video ) కనిపించినట్లుగా ఆ లారీ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయింది.లారీ పడిపోగానే, అక్కడ ఉన్న వాళ్ళంతా చేపల కోసం పరుగులు తీశారు.తమ దగ్గర ఉన్న సంచులు, ప్యాకెట్లలో చేపలను నింపుకున్నారు.ఈ ఘటనతో రోడ్డు ఒక్కసారిగా చేపల మార్కెట్లా మారిపోయింది.ఈ వీడియోను @jist.news అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు.ఇప్పటికే ఈ వీడియోను 830 మంది చూశారు.చాలా మంది కామెంట్లు కూడా చేశారు.ఈ వీడియోకి “బిహార్‌లోని కటిహార్‌లో( Katihar ) చేపల ట్రక్కు అదుపు తప్పడంతో ప్రజలు చేపలను దోచుకుంటున్నారు” అని ఒక క్యాప్షన్ జోడించారు.
ఈ వీడియోలో చాలా గొడవ గొడవగా ఉంటుంది.ఒక రోడ్డు మీద సిల్వర్ కలర్లో మెరిసే చేపలు అన్ని చిందరవందరగా పడి ఉన్నాయి.ప్రజలు అందరూ వాటిని తీసుకోవడానికి పరుగులు తీస్తున్నారు.
పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ చేపలను ఎత్తుకుని పరుగులు తీస్తున్నారు.అంతేకాదు, ప్రతి ఒక్కరూ తమ ఫోన్లు తీసి ఈ దృశ్యాన్ని వీడియో తీస్తున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది.ప్రజలు ఈ వీడియో చూసి ఆశ్చర్యపోతున్నారు, కొంతమంది నవ్వుకుంటున్నారు.
ఒక యూజర్ కామెంట్ చేస్తూ ఇలాంటి సంఘటనలు ఎందుకు ఎక్కువగా బిహార్‌లోనే జరుగుతున్నాయని ప్రశ్నిస్తున్నాడు.బిహార్‌లోని పరిస్థితులు మిగతా భారతదేశంతో పోలిస్తే భిన్నంగా ఉన్నాయని మరికొందరు పేర్కొన్నారు.
బిహార్‌లో ఏదైనా దొరికితే దాన్ని పట్టుకెళ్ళడం చాలా కామన్ అని కొందరు పేర్కొన్నారు.
తాజా వార్తలు