కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు మరో కీలక బాధ్యతలు ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్( Congress ) ఘనవిజయం సాధించే విషయంలో ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కానుగోలు( Sunil Kanugolu ) వ్యూహాలు బాగా కలిసి వచ్చాయి అనే విషయం అందరికీ తెలిసిందే.

అసలు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే ఆశలు ఎవరికి లేకపోయినా, సునీల్ కానుగోలు రాజకీయ వ్యవహారాలు బాగా పనిచేయడం తో పాటు , తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ బాగా కలిసి వచ్చాయి.

  కాంగ్రెస్ విజయం తరువాత సునీల్ కానుగోలుకు ఆ స్థాయిలోనే కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది.

  తాజాగా సునీల్ కానుగోలుకు మరో కీలక పదవిని ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమైనట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

"""/" / ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 ఇటీవల కాలంలో బీఆర్ఎస్( BRS ) దూకుడుగా వ్యవహరిస్తూ ఉండడం,  మీడియా , సోషల్ మీడియాలో కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకుని ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ చేస్తున్న నెగిటివ్ ప్రచారం జనాల్లోకి వెళ్తుండడం , కాంగ్రెస్ గ్రాఫ్ క్రమ క్రమంగా తగ్గుతున్నట్లుగా సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో,  సునీల్ కానుగోలుకు సోషల్ మీడియా( Social Media ) బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం .

ఇటీవల అసెంబ్లీ సమావేశాలు, కరెంటు కోతలు,  ఇతర అన్ని అంశాల విషయంలోనూ బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్న ఎదురుదాడి తెలంగాణ ప్రభుత్వం పై వ్యతిరేఖతను జనాల్లో పెంచుతున్నాయని గుర్తించారు.

"""/" / అసెంబ్లీలో ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ డామినేట్ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తం ఆయిన నేపథ్యంలో మరింతగా కాంగ్రెస్ సోషల్ మీడియాను యాక్టివ్ చేసి బీఆర్ఎస్ బిజెపిలపై పైచేయి సాధించాలనే వ్యూహంతో సునీల్ కానుగోలుకు ఆ బాధ్యతలను అప్పగిస్తే అనుకున్న మేరకు సక్సెస్ అవుతామని కాంగ్రెస్ భావిస్తోందట.

అందుకే ఈ విషయంలో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా సునీల్ పేరు ను కాంగ్రెస్ అధిష్టానం సూచనలతో పరిశీలిస్తున్నట్లు సమాచారం.

వైరల్ అవుతున్న రాకింగ్ రాకేశ్ భార్య సుజాత బేబీ బంప్ పిక్స్.. కంగ్రాట్స్ అంటూ?