అరిజోనా డెమొక్రాటిక్ ప్రైమరీలో భారత సంతతి నేత గెలుపు.. ఎవరీ అమిష్ షా..?

అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్న సంగతి తెలిసిందే.అధ్యక్షుడు జో బైడెన్ రేసులోంచి తప్పుకుని , వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌కు( Kamala Harris ) మద్ధతు తెలిపారు.

 Indian American Amish Shah Wins Democratic Primary In Phoenix Area Details,india-TeluguStop.com

డెమొక్రాట్ నేతలు, ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ, ఇతర ప్రముఖులు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.మరోవైపు.

నవంబర్ 6న జరిగే ఎన్నికల్లో పలువురు భారతీయులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే మాజీ అరిజోనా రాష్ట్ర ప్రతినిధి అమిష్ షా( Amish Shah ) అరిజోనా 1వ కాంగ్రెస్ జిల్లాకు జరిగిన డెమొక్రాట్ ప్రైమరీలో( Democratic Primary ) విజయం సాధించారు.

ఈ జిల్లా ఈశాన్య ఫీనిక్స్ , మూడు సంపన్న శివారు ప్రాంతాలను కవర్ చేస్తుంది.ఈ విజయంతో ఏడుసార్లు కాంగ్రెస్ సభ్యుడిగా వ్యవహరించిన రిపబ్లికన్ నేత డేవిడ్ ష్వీకర్ట్‌తో ఆయన తలపడనున్నారు.

Telugu Amish Shah, Amishshah, Arizona, Democratic, Indian American, Joe Biden, P

అమిష్ షా చికాగోలో పుట్టి పెరిగారు.అతని తల్లిదండ్రులు 1960లలో భారత్ నుంచి అమెరికాకు వలస వచ్చిన ఇంజనీరింగ్ విద్యార్ధులు.అతని తండ్రి జైన్ కాగా.తల్లి హిందువు. అమిష్ షా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించేందుకు అరిజోనా వెజిటేరియన్ ఫుడ్ ఫెస్టివల్‌ను స్థాపించారు.ఇది ఏటా వేలాది మందిని ఆకర్షిస్తూ.ఈ ఏడాదితో ఏడో సంవత్సరానికి చేరుకుంది.అమిష్ షా గతంలో అరిజోనా లెజిస్లేచర్‌లో వైద్యుడిగా( Doctor ) పనిచేశారు.నార్త్ ఫీనిక్స్, స్కాట్స్‌డేల్, ఫౌంటెన్ హిల్స్, ప్యారడైజ్ వ్యాలీ వంటి ప్రాంతాలను కలిగి ఉన్న జిల్లాకు ప్రాతినిధ్యం వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Telugu Amish Shah, Amishshah, Arizona, Democratic, Indian American, Joe Biden, P

2018లో అరిజోనా 24వ లెజిస్లేటివ్ డిస్ట్రిక్ట్‌కు ప్రాతినిథ్యం వహించడానికి షా డెమొక్రాటిక్ ప్రైమరీలోకి ప్రవేశించారు.డెమొక్రాటిక్ ప్రైమరీలో మాజీ స్టేట్ పార్టీ చైర్ ఆండ్రీ చెర్నీ, మాజీ న్యూస్ యాంకర్ మార్లీన్ గాలన్ – వుడ్, ఆర్ధోడాంటిస్ట్ ఆండ్రూ హార్న్, మాజీ అమెరికా రీజినల్ రెడ్‌క్రాస్ సీఈవో కర్ట్ క్రోమెర్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ కోనార్ ఓ కల్లాఘన్‌ సహా పలువురితో పోటీపడ్డారు.షా విజయం అమెరికా రాజకీయాలలో .ముఖ్యంగా అరిజోనా( Arizona ) వంటి విభిన్న జనాభా ఉన్న రాష్ట్రాలలో భారతీయ అమెరికన్ల ప్రాతినిథ్యం పెరగడాన్ని హైలైట్ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube