అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి వారి ఆస్తులు అక్రమంగా స్వాధీన పర్చుకుంటున్న వ్యక్తిపై కేసు నమోదు

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఇంటి పత్రాలు, ఖాళీ బాండ్ పేపర్స్ తాకట్టు పెట్టుకొని అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి వారి ఆస్తులు అక్రమంగా స్వాధీన పర్చుకుంటున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపిన సిరిసిల్ల డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణం నెహ్రు నగర్ కి చెందిన దుబాల మొండయ్య అనే వ్యక్తి అవసరం ఉన్న వారికి అధిక వడ్డీలతో అప్పులు ఇచ్చి వారి వద్ద ఖాళీ బాండ్ పేపర్ల పైన వారి ,ఇంటి పత్రాలను తాకట్టు పెట్టుకొని ఆ అప్పులు కట్టని యెడల వారి యొక్క ఆస్తులను స్వాదీనపర్చుకొవడం

 Man Arrested For Illegally Taking Possession Of Their Properties By Giving Loans-TeluguStop.com

లేదా ఇచ్చిన మొత్తం కన్నా ఎక్కువ విలువ గల ఆస్తులు తన పేరు మీద కానీ ఇతరులకు అమ్మినట్టు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ అమాయకపు ప్రజలను మోసం చేస్తున్నా దుబాల మొండయ్య అనే వ్యక్తి పై పిర్యాదులు వస్తున్న నేపధ్యంలో ఈ రోజు సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్టు సిరిసిల్ల డిఎస్పీ తెలిపారు.

దుబాల మొండయ్య చేతిలో మోసపోయిన బాధితులు చాలా వరకు ఉన్నారని,అట్టి బాధితులు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఎస్పీ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube