అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి వారి ఆస్తులు అక్రమంగా స్వాధీన పర్చుకుంటున్న వ్యక్తిపై కేసు నమోదు

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఇంటి పత్రాలు, ఖాళీ బాండ్ పేపర్స్ తాకట్టు పెట్టుకొని అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి వారి ఆస్తులు అక్రమంగా స్వాధీన పర్చుకుంటున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపిన సిరిసిల్ల డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి.

ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణం నెహ్రు నగర్ కి చెందిన దుబాల మొండయ్య అనే వ్యక్తి అవసరం ఉన్న వారికి అధిక వడ్డీలతో అప్పులు ఇచ్చి వారి వద్ద ఖాళీ బాండ్ పేపర్ల పైన వారి ,ఇంటి పత్రాలను తాకట్టు పెట్టుకొని ఆ అప్పులు కట్టని యెడల వారి యొక్క ఆస్తులను స్వాదీనపర్చుకొవడం లేదా ఇచ్చిన మొత్తం కన్నా ఎక్కువ విలువ గల ఆస్తులు తన పేరు మీద కానీ ఇతరులకు అమ్మినట్టు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ అమాయకపు ప్రజలను మోసం చేస్తున్నా దుబాల మొండయ్య అనే వ్యక్తి పై పిర్యాదులు వస్తున్న నేపధ్యంలో ఈ రోజు సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్టు సిరిసిల్ల డిఎస్పీ తెలిపారు.

దుబాల మొండయ్య చేతిలో మోసపోయిన బాధితులు చాలా వరకు ఉన్నారని,అట్టి బాధితులు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఎస్పీ తెలిపారు.

గుడ్లవల్లేరు ఘటన.. విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన లేడీ ఎస్సై