కరోనా తర్వాత వర్క్ చేసే విధానం పూర్తిగా మారిపోయింది.ఇప్పుడు పనివేళలు గందరగోళంగా ఉన్నాయి.
చాలా మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు.ఇలాంటి పరిస్థితులలో బాస్‌కు,( Boss ) ఉద్యోగికి( Employee ) మధ్య నమ్మకం ముఖ్యమైనది.
కానీ కొంతమంది ఆ నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.వాళ్లు తమ పనిని చాలా తక్కువగా చేస్తూ, బాస్‌ని మోసం చేస్తున్నారు.
ఒక ఉద్యోగి నెల రోజుల పాటు సెలవు తీసుకొని బాస్‌ను పిచ్చోడ్ని చేశాడు.బాస్ ఒక్క వారం మాత్రమే సెలవు ఇచ్చాడు.
మిగతా రోజులు అతను ఇంటి నుంచి పని చేస్తున్నట్టు నటించాడు.కానీ ఆ సమయంలో ఈ ఉద్యోగి ఇటలీకి( Italy ) వెళ్లి హాయిగా ఎంజాయ్ చేశాడు.
![Telugu Boss, Corporate, Employee Boss, Employee Italy, Employees, Italy, Mouse J Telugu Boss, Corporate, Employee Boss, Employee Italy, Employees, Italy, Mouse J](https://telugustop.com/wp-content/uploads/2024/07/Employee-Takes-Month-Long-Vacation-To-Italy-Without-Boss-Finding-Out-detailss.jpg)
అతను రోజూ ఒకటి నుంచి మూడు గంటలు మాత్రమే పనిచేసేవాడు.చాలా మంది ఉద్యోగులు తమ పనిని తక్కువగా చేస్తుంటారని అతను చెప్పాడు.కానీ బాస్‌కి ముఖ్యమైన పని అయితే మాత్రం ఎక్కువ టైమ్ పని చేసేవాడినని అన్నాడు.స్టేబుల్ ఇన్కమ్, సౌకర్యవంతమైన పాలసీల కారణంగా ఈయన తన ఉద్యోగాన్ని వదిలివేయడం కష్టంగా భావించాడు.అందుకే ఇటలీకి సైలెంట్‌గా చెక్కేశాడు.“నేను ప్రతి ఉదయం లాగిన్ చేస్తాను, నా ఇమెయిల్స్, మెసేజ్‌లు చెక్ చేస్తాను.మీటింగ్స్‌కు హాజరయ్యేలా నా రోజును ప్లాన్ చేస్తాను.” అని అన్నాడు.
![Telugu Boss, Corporate, Employee Boss, Employee Italy, Employees, Italy, Mouse J Telugu Boss, Corporate, Employee Boss, Employee Italy, Employees, Italy, Mouse J](https://telugustop.com/wp-content/uploads/2024/07/Employee-Takes-Month-Long-Vacation-To-Italy-Without-Boss-Finding-Out-detailsd.jpg)
బిజీగా, చురుకుగా ఉన్నట్లు కనిపించడానికి, ఉద్యోగి ఇంటర్నల్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్లో కనిపించేలా మౌస్ జిగ్లర్ను( Mouse Jiggler ) ఉపయోగించారు.అతను యాదృచ్ఛిక సందేశాలు, ఈమెయిల్స్‌కు రియాక్ట్ అవ్వడం ద్వారా ప్రదర్శనలను కొనసాగించాడు.
ఇంతవరకు ఎవరూ ఆ ఉద్యోగి ఇంట్లోనే ఉంటున్నాడని అందరూ అనుకున్నారు.వారానికి ఒకసారి ఆఫీసుకు రావాలనే నియమం ఉన్నప్పటికీ, ఎవరూ కచ్చితంగా పాటించడం లేదని అతను చెప్పాడు.
అయితే, బాస్‌కు పట్టుబడితే ఏం చేయాలో ముందుగానే ఆలోచించుకున్నాడు.పట్టుబడితే బాస్‌తో, ‘నేను నా పని బాగా చేస్తున్నాను.
మీకు ఇంకేం కావాలి?’ అని చెప్పాలని అనుకున్నాడట.