రైతుభీమాను సద్వినియోగం చేసుకోవాలి:ఏఓ ఋషింద్రమణి

నల్లగొండ జిల్లా: నూతనంగా వ్యవసాయ పట్టాదారుపాసు పుస్తకాలు పొందిన రైతులు ఆగస్టు 4 లోగా రైతు వేదిక కార్యాలయంలో రైతుభీమా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని వేములపల్లి మండల వ్యవసాయాధికారిణి ఋషింద్రిమణి కోరారు.మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ విస్తరణ అధికారి ధీరావత్ నితిన్ నాయక్ తో కలిసి రైతుల నుండి భీమా దరఖాస్తులను స్వీకరించారు.

 Ao Rishindramani Should Take Advantage Of Rythu Bhima, Rythu Bhima, Ao Rishindra-TeluguStop.com

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూన్ 2024 లోపు పట్టాదారు పాసుపుస్తకాలు పొంది 18 నుండి 59 ఏళ్ల వయస్సు ఉన్న రైతులు రైతు బీమా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు.గతంలో రైతు భీమా పధకం కింద దరఖాస్తు చేసుకున్న రైతులు తిరిగి దరఖాస్తు చేయవలసిన అవసరం లేదన్నారు.

రైతు భీమా కోసం దరఖాస్తు చేసుకునే రైతులు తమ ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు,పట్టాదారు పాసుపుస్తకాల జీరాక్స్ లతో పాటు సెల్ ఫోన్ నెంబర్ ను తమ క్లస్టర్ పరిధిలోని రైతువేదికలో సమర్పించాలన్నారు.గతంలో దరఖాస్తు చేసుకొన్న రైతులు తప్పులుంటే ఈ నెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube