రైతుభీమాను సద్వినియోగం చేసుకోవాలి:ఏఓ ఋషింద్రమణి

నల్లగొండ జిల్లా: నూతనంగా వ్యవసాయ పట్టాదారుపాసు పుస్తకాలు పొందిన రైతులు ఆగస్టు 4 లోగా రైతు వేదిక కార్యాలయంలో రైతుభీమా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని వేములపల్లి మండల వ్యవసాయాధికారిణి ఋషింద్రిమణి కోరారు.

మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ విస్తరణ అధికారి ధీరావత్ నితిన్ నాయక్ తో కలిసి రైతుల నుండి భీమా దరఖాస్తులను స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూన్ 2024 లోపు పట్టాదారు పాసుపుస్తకాలు పొంది 18 నుండి 59 ఏళ్ల వయస్సు ఉన్న రైతులు రైతు బీమా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

గతంలో రైతు భీమా పధకం కింద దరఖాస్తు చేసుకున్న రైతులు తిరిగి దరఖాస్తు చేయవలసిన అవసరం లేదన్నారు.

రైతు భీమా కోసం దరఖాస్తు చేసుకునే రైతులు తమ ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు,పట్టాదారు పాసుపుస్తకాల జీరాక్స్ లతో పాటు సెల్ ఫోన్ నెంబర్ ను తమ క్లస్టర్ పరిధిలోని రైతువేదికలో సమర్పించాలన్నారు.

గతంలో దరఖాస్తు చేసుకొన్న రైతులు తప్పులుంటే ఈ నెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అనంత్ అంబానీకి 40 కోట్ల విలువైన ఫ్లాట్ కానుకగా ఇచ్చిన స్టార్ హీరో?