మహేష్ బాబు ( Mahesh Babu )నటించిన పోకిరి మరియు బిజినెస్ మాన్ రెండు సినిమాలకు కూడా పూరి జగన్నాథ్ డైరెక్టర్.ఆయన ఒక డైరెక్టర్ గా మనందరికీ తెలుసు కానీ పూరి జగన్నాథ్ ఒక వీరభక్తుడు అన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు.
భక్తుడు అంటే ఏ దేవుడికో అనుకునేరు.ఆయన రాంగోపాల్ వర్మకి పిచ్చి ఫ్యాన్.
ఆయన దగ్గర శిష్యరికం చేశాడు.అందుకే రాం గోపాల్ వర్మ ప్రభావం పూరి జగన్నాథ్ ( Puri Jagannath )పై చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది.
అది ఎంతలా అంటే ఒక గ్యాంగ్ లేదా అండర్ వరల్డ్ మాఫియా సినిమాలు తీయాలంటే రాంగోపాల్ వర్మ( Ramgopal Verma ) చేసిన ఏదో ఒక సినిమా నుంచి కాపీ కొట్టి తీసేంత.ఆయన తీసిన సత్య, కంపెనీ, సర్కార్ వంటి సినిమాలు అందుకు నిదర్శనం.
ఇక ఎంతలా పూరి జగన్నాథ్ ఆర్జీవిని కాపీ కొట్టారు అంటే ఆయన తీసిన కంపెనీ సినిమా తెలుగులో తీస్తే అది పోకిరి అయింది.

మీరు గూగుల్లో చూస్తే పోకిరి సినిమాకి ( Pokiri )రైటర్ పూరి జగన్నాథ్ అలాగే దర్శకుడు కూడా అతడే.కానీ సినిమాలో చాలా సీన్స్ కంపెనీలో నుంచి కాఫీ కొట్టి మక్కికి మక్కి తీసినవే.కంపెనీ సినిమాకి మరియు పోకిరి సినిమాకి ఉన్న ఏకైక తేడా అలీ మరియు బ్రహ్మానందం( Ali ,Brahmanandam ) కామెడీ సీన్స్.
అలాగే ఇలియానా మహేష్ బాబు మధ్య రొమాన్స్.ఈ రెండు విషయాలు మినహా పూర్తిస్థాయిలో కంపెనీకి రీమేక్ చిత్రం గా పోకిరి సినిమాను చెప్పుకోవచ్చు.ఇలియానా పాత్రలో కంపెనీ సినిమాలు అయితే ఆంత్రమాలి నటించింది.అలాగే డాన్ గ్యాంగ్ లో ఉన్న అమ్మాయి పాత్రలో మనిషా కొయిరాల నటించింది.
పండుగాడి పాత్రలో అక్కడ వివేక్ ఓబెరాయ్ నటించాడు.

హీరోని ఒక వైపు గ్యాంగ్ లో చేర్చుకోవాలనుకునే సీన్ అలాగే గన్ ఎక్కడ దొరికిందిరా అంటే అక్కడ గ్రౌండ్ లో దొరికింది అంటూ మహేష్ బాబు చెప్పేసే సీన్స్ అన్ని కూడా కంపెనీలో డైలాగ్స్ తో సహా అలాగే ఉంటాయి.పోకిరి సినిమాలో షియాజీ షిండే ( Shiaji Shinde )నటించిన పాత్రలో కంపెనీ సినిమాలో మోహన్ లాల్ నటించాడు.ఇది అతడికి మొదటి హిందీ సినిమా కావడం విశేషం.
ఇలా పూరి జగన్నాథ్ మాఫియా సినిమాలను పూర్తిగా తన గురువైన రాంగోపాల్ వర్మ చిత్రాల నుంచి ఆదర్శంగా తీసుకొని తీస్తున్నాడు.







