బుక్ మై షోలో కల్కితో చరిత్ర సృష్టించిన ప్రభాస్.. రికార్డ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ లేదుగా!

టాలీవుడ్ హీరో ప్రభాస్( Prabhas ) తాజాగా నటించిన చిత్రం కల్కి 2898 ఏడీ.( Kalki 2898 AD ) నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.

 Prabhas Kalki 2898ad Movie Creates New Record In Book My Show Ticket Sales Detai-TeluguStop.com

ఈ సినిమా విడుదల అయ్యి మూడు వారాలు దాటినా కూడా ఈ సినిమా మేనియా ఇంకా తగ్గడం లేదు.రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది.

ఈ సినిమాలో ప్రతి ఒక్క సన్నివేశం అన్ని హైలైట్ గా ఉన్నాయని చెబుతున్నారు.ఇప్పటికే ఈ సినిమా 1000 కోట్లను సాధించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా భారీ విజయం సాధించడంతో పాటు ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి మూవీ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం కల్కి చిత్ర బృందం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

ఇప్పటికే కల్కి సినిమా కలెక్షన్స్( Kalki Collections ) విషయంలో చాలా ఏరియాలలో సరికొత్త రికార్డులు సృష్టించింది.ఈ సినిమాతో ప్రభాస్ కూడా బోల్డన్ని రికార్డులు సృష్టించాడు.

అయితే కల్కి సినిమా మరో సరికొత్త రికార్డ్ సృష్టించింది.మూవీ టికెట్స్ బుక్ చేసుకునే ఆన్లైన్ ప్లాట్ఫారమ్ బుక్ మై షోలో( Book My Show ) రిలీజ్ కి ముందు టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసిన రోజు నుంచి నిన్నటి వరకు కూడా ఆల్మోస్ట్ మూడు వారాలు అవుతున్నా కూడా రోజూ అత్యధిక టికెట్స్ సేల్ అవుతున్నాయి.

ఇప్పటి వరకు ఏ సినిమాకి కూడా ఈ రేంజ్ లో రిలీజ్ కి ముందు, రిలీజ్ అయిన మూడు వారాలకు కూడా టికెట్లు అమ్ముడుపోలేదు.

Telugu Show, Kalki Ad, Kalki, Kalki Tickets, Nag Ashwin, Prabhas, Prabhas Kalki-

తాజాగా బుక్ మై షో కల్కి సినిమాకు టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసిన దగ్గర్నుంచి నిన్నటి వరకు కల్కి సినిమాకు తమ ప్లాట్ ఫారంలో అమ్ముడు పోయిన టికెట్ రేట్ల వివరాలను ప్రకటించింది.కల్కి టికెట్ బుకింగ్స్ జూన్ 23న ఓపెన్ చేయగా ఆ రోజు 328K అంటే ఆల్మోస్ట్ 3 లక్షల 28 వేల టికెట్స్ అమ్ముడు పోయాయి.ఇక కల్కి సినిమా రిలీజ్ రోజు జూన్ 27న ఏకంగా 11 లక్షల 20 వేల టికెట్స్ అమ్ముడుపోయాయట.

రిలీజ్ తర్వాత రోజు ఏకంగా 11 లక్షల 72 వేల టికెట్స్ అమ్ముడు పోయాయట.సినిమా రిలీజయి మూడు వారాల తర్వాత కూడా నిన్న జులై 17న 1 లక్ష 28వేల టికెట్స్ అమ్ముడుపోయాయి.

Telugu Show, Kalki Ad, Kalki, Kalki Tickets, Nag Ashwin, Prabhas, Prabhas Kalki-

అలా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కేవలం ఒక్క బుక్ మై షో ఆన్లైన్ ప్లాట్ ఫార్మ్ నుంచే మొత్తం ఇప్పటి వరకు ఒక కోటి 21 లక్షల 50 వేల టికెట్స్ అమ్ముడయ్యాయట.దీంతో కల్కి సినిమా ఏ సినిమా సృష్టించని మరో రికార్డ్ సృష్టించింది.ఇప్పటివరకు ఒక సినిమాకు అత్యధికంగా బుక్ మై షోలో ఇన్ని టికెట్స్ సేల్ అవ్వడం ఇదే మొదటిసారి అని మూవీ యూనిట్ ప్రకటించింది.ఒక్క బుక్ మై షోలోనే ఇన్ని టికెట్స్ అంటే వివిధ టికెట్ యాప్స్, డైరెక్ట్ గా థియేటర్స్ వద్ద కలిపి ఇంకెన్ని టికెట్స్ అమ్ముడయ్యాయి అని ఆశ్చర్యపోతున్నారు.

ఇలా డార్లింగ్ ప్రభాస్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube