నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన తాజా చిత్రం కల్కి.( Kalki ) ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.
అలాగే అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలు సైతం ఈ సినిమాలో నటించారు.ఇటీవలే విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.
విడుదలైన మొదటి రోజే సూపర్ హిట్ టాక్ రావడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు క్యూ కట్టారు.అంతేకాకుండా ఇప్పటికే దాదాపు 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ సినిమా ఇప్పుడు మరిన్ని కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతోంది.

ఇప్పటికే ఎన్నో రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే.ప్రభాస్ తన గత రికార్డులు తానే బ్రేక్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.దానికి తోడు ఈ సినిమా రేంజ్ లో సక్సెస్ అయిన సినిమా ఈ మధ్యకాలంలో ఏది రాకపోవడంతో ఈ సినిమా హవా ఇంకా తగ్గడం లేదు.ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో మూవీ మేకర్స్ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న విశేష స్పందన పై మూవీ మేకర్స్ ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అందులో భాగంగానే తాజాగా ఈ సినిమాకు వస్తున్న స్పందన పై అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan ) స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

కల్కి ఘన విజయంలో భాగమైన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.ఈ మేరకు అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ.నా వరకూ ఇలాంటి గొప్ప చిత్రంలో భాగమైనందుకు ఆనందిస్తున్నాను.ఈ చిత్రాన్ని నేను ఎంతగా ఎంజాయ్ చేశానో చెప్పడానికి మాటలు చాలడం లేదు.ఇప్పటికే నాలుగుసార్లు సినిమా చూశాను.సినిమా చూసిన ప్రతిసారీ ఏదోఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటూనే ఉన్నాను అని ఆయన అన్నారు.
అంతేకాదు ఈ మధ్యకాలంలో ప్రభాస్ నటించిన సినిమాలు 1000 కోట్ల కలెక్షన్ లు దాటాయి అని ఆయన తెలిపారు.ప్రభాస్ నటించిన సినిమాలు 1000 కోట్లు సాధించడం అన్నది సాధారణమైన విషయమే అని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా అమితాబ్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.