వర్షంలో తడుస్తూ సహాయం చేసిన సోనూసూద్.. రియల్ హీరో మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు ప్రేక్షకులకు సోనూసూద్( Sonusood ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సినిమాలలో విలన్ పాత్రలో నటించినప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకున్నారు.

 Sonu Sood Meets People Who Queue Up For Help Outside His House In Mumbai Despite-TeluguStop.com

కొన్ని వేలాది మందికి సహాయం చేసి దేశవ్యాప్తంగా భారీగా అభిమానులను సంపాదించుకున్నారు.సినిమాల ద్వారా అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన సోనూసూద్ కరోనా మహమ్మారి( Corona ) సమయంలో ఎంతో మందికి సహాయం చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఎంతోమంది సోనూసూద్ ఫోటోలు ఇంట్లో పెట్టుకొని దేవుడిలా భావించి పూజలు కూడా చేస్తున్నారు.

ఇకపోతే ప్రస్తుతం సినిమాలలో తక్కువగా నటిస్తున్న ఎక్కువ సమయాన్ని ప్రజలకు సేవ చేయడానికి కేటాయిస్తున్నారు.సాయం కోరి తన దగ్గరకు వచ్చే వారి కష్టాలు విని ఆపన్నహస్తం అందించేందుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాడు.ఈ నేపథ్యంలో సాయం కోసం రోజూ వందలాది మంది సోనూ సూద్ ఇంటికి వెళుతున్నారు.

ఇదిలా ఉంటూ గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.దాంతో ఈ భారీ వర్షాల కారణంగా ముంబై ( Mumbai ) నగరమంతా కూడా తడిసి ముద్దవుతోంది.

దీంతో జనాలందరూ ఇంటికే పరిమితమయ్యారు.ఏదైనా అత్యవసరమైతే తప్ప బయటకు అడుగుపెట్టడం లేదు.

కానీ సోనూసూద్ మాత్రం అలా చేయలేదు.

భారీ వర్షంలోనూ సాయం కోసం తన ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్లను కలిసారు.ఒకవైపు భోరున వర్షం కురుస్తున్నా ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సోనూసూద్ తడుస్తూనే ప్రజల కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నాడు.తన వంతు సాయం చేస్తానని వారికి మాట ఇచ్చాడు.

అలాగే ఎవరినీ కాదనకుండా ఎంతో ఓపికగా అందరితో సెల్ఫీలు, ఫొటోలు దిగి వారి కళ్లల్లో ఆనందం నింపాడు.ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు సోనూసూద్ రియల్ హీరో( Sonusood Real Hero ) క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.ఇకపోతే ఇక సినిమాల విషయానికి వస్తే.గత ఏడాది కన్నడ, తమిళ సినిమాల్లో నటించిన సోనూసూద్ ప్రస్తుతం ఫతేహా అనే సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాకు తానే దర్శకత్వం కూడా వహించనున్నాడు.

ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube