సూర్యాపేట జిల్లా: ఆత్మకూర్ (ఎస్) మండలం బొప్పారం గ్రామంలో బుధవారం ఉదయం ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.మృతులు యాదాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు చెందిన తండ్రి కూతురు శ్రావెల్య రాజు (45) శ్రావెల్య ఉష (12),
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జూపెడ గ్రామానికి చెందిన చిప్పారెడ్డి శ్రీపాల్ రెడ్డి (35)గా గుర్తించారు.
ఖమ్మం నుండి నుంచి బంధువుల ఇంటికి బొప్పారం గ్రామానికి వచ్చి స్థానికంగా క్రషర్ గుంతల్లో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు.