సముద్రం మధ్యలో జరిగే ప్రమాదాల గురించి మీరు వినే ఉంటారు.నీటిలో ఏం జరుగుతుందో ఊహించడం కష్టం.
పెద్దగా అలలు రావచ్చు.నీటిలో మంచు గడ్డకట్టుకుపోయి షిప్పులను ధ్వంసం చేయవచ్చు.
తిమింగలాలు షార్క్ చేపలు దాడి చేయవచ్చు.అందుకే ప్రజలకు సముద్రం అనేది ఎప్పటికీ సేఫ్ కాదు.
సముద్రం( sea ) ఒక్కటే కాదు బీచ్‌లో కూడా ప్రమాదాలు జరుగుతాయని మీకు తెలుసా?.
సాధారణంగా బీచ్‌లో ( beach )ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం చాలా తక్కువ.
కానీ ఫ్లోరిడాలోని ఒక బీచ్ మిగతా వాటికి భిన్నం.ఈ బీచ్‌కు “అమెరికాలో అత్యంత ప్రమాదకరమైన బీచ్” అనే అపకీర్తి వచ్చింది.
ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా మంది మరణించారు.ఫ్లోరిడా ( Florida )తూర్పు తీరంలో ఉన్న ఈ బీచ్‌ను న్యూ స్మర్నా బీచ్ అని పిలుస్తారు.
ఈ అందమైన బీచ్ ఒడ్డున, నీటిలో ఎక్కువ మంది మరణించడానికి అనేక కారణాలు ఉన్నాయి.
ఈ బీచ్‌లో ఎక్కువ మరణాలకు కారణాలు ఏంటో తెలుసుకుంటే ఈ ప్రాంతం తరచుగా హరికేన్ల బారిన పడుతుంది, ఇవి బీచ్‌ను దెబ్బతీస్తాయి.ప్రమాదకరమైన పరిస్థితులను సృష్టిస్తాయి.న్యూ స్మర్నా బీచ్‌ను “షార్క్ బైట్ కాపిటల్”( Shark Bite Capital ) అని కూడా పిలుస్తారు.2010 నుంచి ఇక్కడ 32 షార్క్ దాడులు జరిగాయి, 1981లో చివరి మరణం సంభవించింది.బలమైన అలలు, అనూహ్యమైన రిప్ కరెంట్లు ఈ బీచ్‌లో సర్ఫింగ్‌ను చాలా ప్రమాదకరంగా మారుస్తాయి.
జూలై నెల ప్రారంభంలో, ఈ బీచ్‌లో కేవలం కొన్ని రోజుల్లోనే 400 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.భారీ జనసందడి, అనూహ్యమైన రిప్ కరెంట్ల కారణంగా ఇలా జరిగి ఉండవచ్చు.జులై 3 నుంచి ఈ ప్రాంతంలో మూడు షార్క్ దాడులు జరిగాయి.కాబట్టి ఈ బీచ్ కి వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.