ప్రేక్షకులకు నచ్చకపోవడంతో లెన్త్ తగ్గించుకున్న సినిమాలు ఇవే !

సినిమా అంటే ఒకప్పుడు మూడు గంటలు.కానీ తర్వాత రోజుల్లో అది రెండున్నర గంటలకు పరిమితమైంది.

 Tollywood Movies Which Are Trimmed After Release, Indian 2 , Tollywood Movies, R-TeluguStop.com

కంటెంట్ బాగుంటే మూడు గంటలు నాలుగు గంటలు కూడా చూస్తారు కానీ అదే సినిమా బాగా లేకపోతే మాత్రం గంటసేపు కూడా థియేటర్లో కూర్చోవడానికి ప్రేక్షకులు ఒప్పుకోరు.సినిమా నడుస్తుంటే ఒక్క నిమిషం ఏమరపాటుగా అనిపించినా సరే ఫోన్ ఓపెన్ చేసి ప్రేక్షకుడు సినిమాను వదిలేస్తున్న రోజులు ఇవి.అంతలా సినిమా థియేటర్ కి ప్రేక్షకులు రావడానికి ఇబ్బంది పడుతున్నారు.మరి ఇలాంటి సమయంలో కంటెంట్ బాగా లేకపోయినా సరే మూడు గంటల పైగా దాన్ని సిద్ధం చేసి థియేటర్స్ లో విడుదల చేసి ఆ తర్వాత ప్రేక్షకులు రిజెక్ట్ చేయడంతో లెంత్ తగ్గించుకున్న కొన్ని సినిమాలు ఉన్నాయి.

అయినా కూడా ఫలితాల్లో పెద్దగా తేడా లేదు కానీ సినిమా ముందు చేయాల్సిన పని విడుదల అయ్యాక చేశారు.ఆ ఆర్టికల్స్ ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

భారతీయుడు 2

Telugu Indian, Rebel, Tigernageswara, Tollywood-Movie

కమల్ హాసన్ నటించిన తాజా సినిమా భారతీయుడు( Indian 2 ) సీక్వెల్.ఈ సినిమా మూడు గంటలకు వచ్చి థియేటర్లోకి వచ్చినప్పటికీ ప్రేక్షకులకు చాలా సీన్స్ బోర్ కొట్టాయి దాంతో విడుదలైన రెండవ రోజు ఈ సినిమాలోని అరగంటకు పైగా కంటెంట్ ని కత్తిరించేసి మళ్ళీ విడుదల చేశారు.కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ కాస్త జరిగిపోయింది.

రెబల్

Telugu Indian, Rebel, Tigernageswara, Tollywood-Movie

ప్రభాస్ తమన్నా హీరో హీరోయిన్స్ గా నటించిన సినిమా రెబల్( rebel).ఈ సినిమా కూడా మొదట థియేటర్లో మూడు గంటల కంటెంట్ తో విడుదల అయింది.కానీ ప్రేక్షకులు పెదవి విరచడంతో ఈ సినిమాలోని 20 నిమిషాలకు పైగా సీన్స్ ని కట్ చేసి మళ్లీ విడుదల చేశారు.

టైగర్ నాగేశ్వరరావు

Telugu Indian, Rebel, Tigernageswara, Tollywood-Movie

రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా సైతం మూడు గంటల డ్యురేషన్ తో థియేటర్స్ కి వచ్చింది.ఆ తర్వాత సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది దాంతో 15 నిమిషాల సీన్స్ ని కత్తిరించారు.కానీ ఈ సినిమా ఫలితం ఏమాత్రం మారలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube