సాధారణంగా లేడీస్ లో చాలా మందికి లాంగ్ హెయిర్( Long hair ) ను పొందాలనే కోరిక ఉంటుంది.లాంగ్ హెయిర్ కోసం జుట్టు పై రకరకాల ప్రయత్నాలు ప్రయోగాలు చేస్తుంటారు.
జుట్టును పొడుగ్గా పెంచడానికి మార్కెట్లో ఎన్నో రకాల సీరంలు అందుబాటులో ఉన్నాయి.అయితే ఆ సీరంల వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.
ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ సీరం మాత్రం మీకు చాలా బాగా సహాయపడుతుంది.వారానికి ఒక్కసారి ఈ సీరం ను కనుక వాడితే లాంగ్ హెయిర్ మీ సొంతం అవుతుంది.
అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( fenugreek ) వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఒక బౌల్ తీసుకొని అందులో మెంతులు నానబెట్టుకున్న వాటర్ ను పోసుకోవాలి.అలాగే ఆ వాటర్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ ( aloe vera gel )మరియు వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive oil ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన సీరం అనేది సిద్ధమవుతుంది.
ఈ న్యాచురల్ సీరం ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి సున్నితంగా పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.సీరం అప్లై చేసుకున్న గంట లేదా రెండు గంటలు అనంతరం తేలిక పాటి ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ హోమ్ మేడ్ సీరం వాడితే హెయిర్ గ్రోత్ అనేది డబల్ అవుతుంది.జుట్టు పొడుగ్గా ఒత్తుగా పెరుగుతుంది.పొడవాటి జుట్టును కోరుకునే వారికి ఈ సీరం బెస్ట్ వన్ గా చెప్పుకోవచ్చు.పైగా ఈ సీరం ను వాడటం వల్ల హెయిర్ ఫాల్ దూరమవుతుంది.
కురులు ఆరోగ్యంగా, స్ట్రాంగ్ గా మారతాయి.మరియు పురుషుల్లో అయితే ఈ సీరం బట్టతల వచ్చే రిస్క్ ను సైతం తగ్గిస్తుంది.