హలో లేడీస్.. లాంగ్ హెయిర్ ను పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ సీరం మీకోసమే!
TeluguStop.com
సాధారణంగా లేడీస్ లో చాలా మందికి లాంగ్ హెయిర్( Long Hair ) ను పొందాలనే కోరిక ఉంటుంది.
లాంగ్ హెయిర్ కోసం జుట్టు పై రకరకాల ప్రయత్నాలు ప్రయోగాలు చేస్తుంటారు.జుట్టును పొడుగ్గా పెంచడానికి మార్కెట్లో ఎన్నో రకాల సీరంలు అందుబాటులో ఉన్నాయి.
అయితే ఆ సీరంల వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.
ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ సీరం మాత్రం మీకు చాలా బాగా సహాయపడుతుంది.
వారానికి ఒక్కసారి ఈ సీరం ను కనుక వాడితే లాంగ్ హెయిర్ మీ సొంతం అవుతుంది.
"""/" /
అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek ) వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు ఒక బౌల్ తీసుకొని అందులో మెంతులు నానబెట్టుకున్న వాటర్ ను పోసుకోవాలి.
అలాగే ఆ వాటర్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ ( Aloe Vera Gel )మరియు వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive Oil ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
తద్వారా మన సీరం అనేది సిద్ధమవుతుంది. """/" /
ఈ న్యాచురల్ సీరం ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి సున్నితంగా పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
సీరం అప్లై చేసుకున్న గంట లేదా రెండు గంటలు అనంతరం తేలిక పాటి ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.
వారానికి ఒకసారి ఈ హోమ్ మేడ్ సీరం వాడితే హెయిర్ గ్రోత్ అనేది డబల్ అవుతుంది.
జుట్టు పొడుగ్గా ఒత్తుగా పెరుగుతుంది.పొడవాటి జుట్టును కోరుకునే వారికి ఈ సీరం బెస్ట్ వన్ గా చెప్పుకోవచ్చు.
పైగా ఈ సీరం ను వాడటం వల్ల హెయిర్ ఫాల్ దూరమవుతుంది.కురులు ఆరోగ్యంగా, స్ట్రాంగ్ గా మారతాయి.
మరియు పురుషుల్లో అయితే ఈ సీరం బట్టతల వచ్చే రిస్క్ ను సైతం తగ్గిస్తుంది.
బాలయ్య సైన్స్ ఫిక్షన్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడా..?