స్టార్ హీరోని చేసిన దర్శకుడినే అవమానించిన చిరంజీవి..??

సినిమా ఇండస్ట్రీలో ఎంతటి ప్రతిభ దర్శకుడు అయిన ఏదో ఒక సమయంలో ఫ్లాప్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది.ఇప్పట్లో అంటే కొన్ని ఏళ్ల సమయం తీసుకుని సినిమాలు తీస్తున్నారు కానీ అప్పట్లో డైరెక్టర్ తక్కువ సమయంలోనే ఎక్కువ చేసేవారు.

 Chiranjeevi Insulted Star Director , A Kodandarami Reddy, Chiranjeevi , Tolly-TeluguStop.com

ఫోకస్ లేకపోవడం వల్ల సక్సెస్ రేటు తక్కువగా ఉండేది.కానీ ఒక డైరెక్టర్ విషయంలో మాత్రం ఇలా జరగలేదు.

ఆయన డైరెక్ట్‌ చేసిన 94 సినిమాల్లో దాదాపు 80 సినిమాలు సూపర్‌హిట్‌ సాధించి అతడిని దిగ్గజ దర్శకుడిగా నిలిపాయి.ఆ డైరెక్టర్‌ మరెవరో కాదు ఎ.

కోదండరామిరెడ్డి( A.Kodandarami Reddy ).కోదండరామిరెడ్డి మెగాస్టార్‌ చిరంజీవి( Megastar Chiranjeevi )తో ఎక్కువగా సినిమాలు చేసేవారు.‘సంధ్య’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన కోదండరామిరెడ్డి ఆపై ‘న్యాయం కావాలి’ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నారు.

చిరంజీవి కెరీర్‌లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది.చిరు ఇందులో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న ఈ క్యారెక్టర్‌ పోషించాడు.

దీని తర్వాత చిరు, కోదండరామిరెడ్డి కలిసి ‘కిరాయి రౌడీలు’ సినిమా తీసి హిట్టు కొట్టారు.మళ్లీ వీళ్లు కలిసి ‘ఖైదీ( Khaidi )’ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

Telugu Chiranjeevi, Khaidi, Muta Mestri, Tollywood-Movie

చిరంజీవి స్టార్‌ హీరో అయిపోయాడు.ఆపై ఛాలెంజ్‌, అభిలాష, రాక్షసుడు, గూండా, దొంగ, విజేత, పసివాడి ప్రాణం, దొంగమొగుడు, కొండవీటి దొంగ, ముఠామేస్త్రి ఇలా వీళ్ల కాంబినేషన్‌లో టోటల్‌గా 23 సినిమాలు వచ్చాయి.ముఠామేస్త్రి (1993) సినిమా చేసినాక మళ్ళీ ఇద్దరూ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు.అంటే ఈ 3 దశాబ్దాలలో వీరి కాంబినేషన్‌లో ఏ సినిమా తెరకెక్కలేదు.

Telugu Chiranjeevi, Khaidi, Muta Mestri, Tollywood-Movie

ఈ సంగతి పక్కన పెడితే చిరంజీవి ఓ రీసెంట్ ఇంటర్వ్యూలో తను మెగాస్టార్‌గా ఎదగడానికి కారకులైన దర్శకుల గురించి మాట్లాడాడు.ఆయన చెప్పిన డైరెక్టర్స్‌ లిస్ట్‌లో కోదండరామిరెడ్డి పేరు లేదు.తనతో ఒక్క సినిమా తీసిన వారి పేర్లు కూడా చిరు ప్రస్తావించాడు కానీ ఈ కోదండరామిరెడ్డి గురించి పెదవి మెదపలేదు.దీంతో మెగా ఫ్యాన్స్ సైతం షాక్‌ అయ్యారు.

చిరంజీవికి స్టార్‌ హీరో అయ్యాడంటే అది కోదండరామిరెడ్డి సినిమాలతోనే సాధ్యమైందని చెప్పవచ్చు.కానీ చిరు అతను గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

అయితే దీనివల్ల తాను చాలా బాధపడ్డాను అని కోదండరామిరెడ్డి మరో ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.తనకు, చిరంజీవికి మధ్య మనస్పర్ధలు ఏమీ లేవని అన్నారు.

చాలా హర్ట్ అయినట్లు కూడా తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube