ఆఫర్ల కోసం లిప్ ఫిల్లర్స్ వేయించుకున్నా.. శ్రీసత్య సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా శ్రీసత్య( Sri Satya: ) తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో కెరీర్ ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.సీరియల్స్, వెబ్ సిరీస్ లలో నటించిన శ్రీసత్య కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతూ ప్రశంసలు అందుకుంటున్నారు.

 Srisatya Clarity About Lip Fillers Details Inside Goes Viral In Social Media ,-TeluguStop.com

కొన్ని సినిమాలలో శ్రీసత్యకు ఆఫర్లు వస్తున్నా ఎడిటింగ్ లో ఆమె పాత్రలు తీసేస్తుండటం గమనార్హం.టిల్లూ స్క్వేర్ సినిమా( Tillu Square )లో ఛాన్స్ వచ్చినా శ్రీసత్య నటించిన సాంగ్ ఎడిటింగ్ లో పోయింది.

Telugu Bigg Boss, Dance Shows, Lip Fillers, Serials, Sri Satya, Tillu Square, To

ఆ సినిమాలో కేవలం అర సెకను మాత్రమే శ్రీసత్య కనిపిస్తారు.తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన శీసత్య అ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.సినిమాల్లో కనిపించాలనేది నా కల అని కానీ నేను చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదని ఆమె పేర్కొన్నారు.నేను సీరియళ్లు చేస్తున్నానని కొంతమంది మూవీ ఆఫర్లు ఇవ్వడం లేదని శ్రీసత్య పేర్కొన్నారు.

Telugu Bigg Boss, Dance Shows, Lip Fillers, Serials, Sri Satya, Tillu Square, To

ఆ రీజన్ వల్లే నేను సీరియళ్లు మానేశానని శ్రీసత్య చెప్పుకొచ్చారు.నేను తెలుగమ్మాయినని కూడా నాకు ఆఫర్లు ఎక్కువగా ఇవ్వడం లేదని శ్రీసత్య చెప్పుకొచ్చారు.డ్యాన్స్ షోలు( Dance shows ) చేసే సమయంలో నా గురించి చెత్తగా వాగుతున్నారని ఆమె పేర్కొన్నారు.ఎవరితో డ్యాన్స్ చేసినా మా మధ్య ఏదో ఉందని అసభ్యంగా మాట్లాడుతున్నారని శ్రీసత్య వెల్లడించడం గమనార్హం.

ఎవరితో కలిసి డ్యాన్స్ చేసినా మా మధ్య ఏదో ఉందని అసభ్యంగా ప్రచారం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.పర్సనల్ లైఫ్ ను ప్రొఫెషనల్ లైఫ్ ను కలిపి చూడొద్దని శ్రీసత్య వెల్లడించారు.

నేను చిన్నపిల్లలా కనిపిస్తున్నానని ఆఫర్లు ఇవ్వడం లేదని అందుకని లిప్ ఫిల్లర్స్ వేయించుకున్నానని ఆమె పేర్కొన్నారు.శ్రీసత్య చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.రాబోయే రోజుల్లో అయినా శ్రీసత్య కెరీర్ పరంగా బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube