పాకిస్థాన్‌లో( Pakistan ) ఘోర సంఘటన చేసుకుంది.చికెన్‌లో మసాలా( Chicken Masala ) సరిగ్గా వేయలేదని భర్త, అత్తమామలు భార్యను భవనం నుంచి తోసివేసి హత్య చేయడానికి ప్రయత్నించారని తెలిసింది.
లాహోర్( Lahore ) ఈ సంఘటన చోటుచేసుకుంది.దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటన లాహోర్ లోని షాలిమార్ రోడ్, నానారియాన్ చౌక్ సమీపంలో జరిగిందని వార్తలు తెలుపుతున్నాయి.మసాలా సరిగ్గా వేయలేదని కోపంతో భర్త, అత్తమామలు ఈ దారుణానికి పాల్పడ్డారని కొందరు చెబుతున్నారు.
గాయపడిన బాధితురాలును వెంటనే ఆసుపత్రికి తరలించారు.
వైరల్ సీసీటీవీ దృశ్యాలలో బాధితురాలు కేకలు వేస్తూ, ఇంటి పై అంతస్తు నుంచి పడిపోతున్నట్లు కనిపిస్తుంది.బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, స్థానిక పోలీసు అధికారులు మహిళ భర్త, అత్తమామలపై కేసు నమోదు చేశారు.నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
గాయపడిన బాధితురాలును వెంటనే ఆసుపత్రికి తరలించారు.బాధితురాలి ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా తెలియ రాలేదు.
ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అధికారి (IO) బాధితురాలు కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్యాయత్నం చేసుకుందని అనుమానిస్తున్నారు.అయితే, ఈ ఘటనపై ఇంకా అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరుగుతోంది.“ఈ ఘటన చాలా దారుణమైనది, క్షమించరానిది.మహిళలపై హింస( Violence Against Women ) ఎప్పుడూ సరైనది కాదు.ఈ ఘటనకు సంబంధించిన నిందితులను కఠినంగా శిక్షించాలి.” అని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే అత్తవారి ఇంట్లో కాపురం చేస్తున్న చాలామంది మహిళలు ఇలాగే టార్చర్ ఫేస్ చేస్తున్నారు.వరకట్న వేధింపులు, గొడ్డు చాకిరీ చేయించడం, గొడవలు పడటం భర్త భార్యను వేరు చేయడం లాంటివి కామన్ అయిపోయాయి.