బీజేపీకి బీఆర్ఎస్ దగ్గరవుతోందా ?  వారిద్దరి ఢిల్లీ టూర్ అందుకేనా ? 

తెలంగాణలో అధికారం కోల్పోవడం,  పార్టీ నుంచి వలసలు జోరందుకోవడం, పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన వరుసగా కాంగ్రెస్ లో( Congress ) చేరిపోతుండడం ఈ పరిణామాలన్నీ  బీఆర్ఎస్ లో( BRS ) ఆందోళన పెంచుతున్నాయి.  ఇదిలా ఉంటే బీఆర్ఎస్ లో కీలక నేతలుగా ఉన్న కేటీఆర్( KTR )  హరీష్ రావు( Harish Rao ) ఇద్దరూ వారం రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలోనే మకాం వేశారు.

 What Is The Reason Behind Ktr Harish Rao Delhi Tour Details, Brs, Bjp, Congress,-TeluguStop.com

  ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) వ్యవహారంలో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) కోసం హరీష్ రావు,  కేటీఆర్ లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని , అందుకే అన్ని రోజులు ఢిల్లీలో ఉన్నారని అంత భావించారు.అయితే అసలు కథ వేరే ఉందనే విషయం ఇప్పుడిప్పుడే బయటికి వస్తోంది.

ఇటీవల కాలంలో పార్టీ నుంచి వలసలు జోరందుకోవడం,  బీఆర్ఎస్ లో ఆందోళన పెంచుతుంది.

Telugu Congress, Harish Rao, Kavita, Ktr Delhi, Mlc Kavita, Telangana-Politics

ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోతున్నారు.ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్  చేరిపోయారు.త్వరలో బిఆర్ఎస్ఎల్సీని విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

  ఈ నేపథ్యంలో పార్టీని కాపాడుకునేందుకు కేసిఆర్ వ్యూహాత్మకంగా ఆలోచించారని , దానిలో భాగంగానే హరీష్ , కేటీఆర్ లు ఢిల్లీలో వారం రోజులు పాటు ఉన్నారనే ప్రచారం పార్టీ నేతల మధ్య జరుగుతుంది.  రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మరింతగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని,  తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ బిజెపి అగ్ర నాయకులందరి పైన వివిధ కేసులు నమోదు చేయించడం,  ఎంక్వయిరీ కమిషన్ల పేరుతో హడావుడి చేస్తున్న క్రమంలో,  రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది అని కెసిఆర్ అంచనా వేస్తున్నారు.

Telugu Congress, Harish Rao, Kavita, Ktr Delhi, Mlc Kavita, Telangana-Politics

కేటీఆర్,  హరీష్ రావు వారం రోజులు ఢిల్లీలోనే ఉన్నారు.  బయటికి కవిత బెయిల్ కోసం న్యాయవాదులతో సంప్రదింపులు చేస్తున్నారని చెబుతున్నా.  అసలు కారణం వేరే ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది.బిజెపితో పొత్తు కోసం  ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం పార్టీలోనే జరుగుతుంది.  ఢిల్లీలో కేటీఆర్ , హరీష్ రావులు ఎవరెవరిని కలిశారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఢిల్లీ నుంచి రాగానే హరీష్ కేటీఆర్ లు ఫామ్ హౌస్ లో ఉన్న కేటీఆర్ తో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఢిల్లీ పరిణామాల పైన చర్చించారట.మొత్తంగా బిజెపితో( BJP ) పొత్తు దిశగానే బీఆర్ఎస్ అడుగులు వేస్తోందనే ప్రచారం తీవ్రంగా జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube