బీరకాయ.ఇండియా వైడ్ చాలా కామన్ గా తినే కూరగాయల్లో ఒకటి.
మృదువైన స్వభావాన్ని కలిగి ఉండడం వల్ల బీరకాయను వండడం చాలా సులభం.పైగా భారతీయులు బీరకాయతో(ridge gourd) రకరకాల కూరలు తయారు చేస్తుంటారు.
రుచి పరంగానే కాదు పోషకాల పరంగా కూడా బీరకాయ కింగే.విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, ఫోలేట్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం తదితర పోషకాలు బీరకాయలో ఉంటాయి.
ప్రస్తుత వర్షాకాలంలో తినదగ్గ కూరగాయల్లో బీరకాయ ఒకటి.
వారానికి రెండు సార్లు బీరకాయ(ridge gourd) తినమని నిపుణులు చెబుతున్నారు.
ఒకవేళ మీరు కనుక బీరకాయను తినకుంటే మాత్రం ఇప్పుడు చెప్పబోయే విషయాలను తప్పక తెలుసుకోండి.బీరకాయ ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది.
బీరకాయలో విటమిన్ సి మెండుగా ఉంటుంది.ఇది ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ కు మద్దతు ఇస్తుంది.
బీరకాయలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు(
Anti Oxidants) ప్రస్తుత వర్షాకాలంలో(rainy season) అంటువ్యాధులు మరియు ఇతర వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

అలాగే మధుమేహం ఉన్నవారికి బీరకాయ ఒక వరం అనే చెప్పుకోవచ్చు.బీరకాయలో సమృద్ధిగా ఉండే ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మరియు ఆకస్మిక స్పైక్‌లు, క్రాష్‌లను నివారించడంలో తోడ్పడుతుంది.జీర్ణక్రియలో సహాయపడే మరియు ఆరోగ్యకరమైన ప్రేగులను ప్రోత్సహించే ఎంజైమ్‌లను మనం బీరకాయ ద్వారా పొందవచ్చు.

అలాగే బీరకాయ ఎక్కువ సమయం పాటు కడుపులో నిండుగా ఉంచుతుంది.అందువల్ల వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తున్న వారికి లంచ్ లో తినడానికి బీరకాయ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.అంతేకాదు బీరకాయ రక్తాన్ని శుద్ధి (Purify the blood) చేయడంలో సహాయపడుతుంది.కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.కామెర్లు, పైల్స్(Jaundice, piles) వంటి జబ్బులను నివారించడంలో తోడ్పడుతుంది.ఉదర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
మరియు మలబద్ధకాన్ని సైతం తరిమికొడుతుంది.