బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి దీపిక పదుకొనే ( Deepika Padukone ) ఒకరు.ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా ( Kalki Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు.ఇకపోతే ఈమె త్వరలోనే మరో కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్న సంగతి మనకు తెలిసిందే.
పెళ్లి తర్వాత చాలా సంవత్సరాలకు తాను తల్లి కాబోతున్నాననే శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు.
ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్న దీపిక పదుకొనే ఇటీవల కల్కి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బయటకు రావడంతో ఈమె బేబీ బంప్ ( Baby Bump ) కి సంబంధించిన ఫోటోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇక ఫిబ్రవరి నెలలో ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్న దీపికా సెప్టెంబర్ నెలలో బిడ్డకు జన్మనివ్వబోతున్నారని తెలుస్తుంది.అయితే ఈమెకు పుట్టబోయేది అబ్బాయా అమ్మాయా అనే విషయం గురించి అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రముఖ జ్యోతిష్యులు పండిట్ జగన్నాథ్ గురూజీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
దీపికా పదుకొనే రణవీర్ సింగ్( Ranaveer Singh) జాతకాలను బట్టి చూస్తే వీరికి కలిగే ప్రథమ సంతానం అబ్బాయి అంటూ ఈయన తెలియజేశారు.ఇక ఈ అబ్బాయి వీరి జీవితంలో ఒక యువరాజుల పెరగబోతున్నారని ఈ యువరాజు కారణంగా తల్లిదండ్రుల కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయని జగన్నాథ్ గురూజీ వెల్లడించారు.ఇక ఈ దంపతులకు మగ బిడ్డ పుట్టడం వల్ల వీరికి మరింత అదృష్టం కలిసి వస్తుందని ఈయన తెలిపారు.
మొత్తానికి దీపికకు అబ్బాయి పుట్టబోతున్నారనే విషయం తెలియజేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మరి ఈయన జాతకం ఎంతవరకు నిజం అనేది తెలియాలి అంటే సెప్టెంబర్ వరకు వేచి చూడాల్సిందే.