ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ షో( Bigg Boss Show ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ బిగ్ బాస్ షో తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రసారం అవుతూ సీజన్లో మీద సీజన్లు పూర్తి చేసుకుంటోంది.
తెలుగులో ఇప్పటివరకు ఏడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.త్వరలోనే ఎనిమిదవ సీజన్ కూడా మొదలుకానుంది.
మరీ ముఖ్యంగా గత సీజన్ టీఆర్పీ రికార్డులను అందుకుంది.అయితే బిగ్ బాస్ సీజన్ 8( Bigg Boss Season 8 ) ఎప్పుడు ప్రారంభమవుతుంది? అని టీవీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
దీని ఆధారంగానే సీజన్ 8కి రంగం సిద్ధం చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి.అయితే ఈ షోకి మద్దతుగా కొందరు కామెంట్ చేస్తుండగా మరికొందరు మాత్రం పనికిమాలిన షో అంటూ విమర్శలు కూడా చేస్తూ ఉంటారు.ఇకపోతే ప్రతిసారి కూడా ఎక్కువ శాతం మంది బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రిటీల ఎంట్రీ ఇస్తూ ఉంటారు.కేవలం ఒకరు ఇద్దరు మాత్రమే సామాన్యులు ఎంట్రీ ఇస్తుంటారు.
గత సీజన్ లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి విజయం సాధించిన విషయం తెలిసిందే.అయితే ఈసారి మాత్రం బిగ్ బాస్ చూపు మొత్తం సామాన్యుల వైపే ఉన్నట్లు తెలుస్తోంది.
సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఒక సామాన్యుడు.వచ్చిన చిన్న అవకాశాన్ని నిచ్చెనగా మార్చుకుని బిగ్ బాస్ కప్పు కొట్టి శభాష్ అనిపించాడు.దీంతో ప్రేక్షకుల సపోర్ట్ కామన్ మేన్స్ కే ఎక్కువ ఉంటుందని తెలుసుకున్న బిగ్ బాస్ నిర్వాహకులు ఇలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.సెలబ్రిటీస్ ని( Celebrities ) పెట్టి వీక్షకులతో తిట్లు తినే కన్నా సామాన్యులకే అవకాశం బెటర్ అంటూ నెటిజెన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.