టిడిపి అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పై( CM Chandrababu Naidu ) సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో( AP High Court ) పిటిషన్ దాఖలు అయింది.గతంలో చంద్రబాబుపై నమోదైన ఆరు కేసులకు సంబంధించి వెంటనే సీబీఐ విచారణ( CBI Inquiry ) జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది .
మొత్తం 114 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ ఈ పిటిషన్ దాఖలు అయింది. చంద్రబాబుపై దాఖలైన కేసులు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం ,( AP Skill Development Scam ) మద్యం అవకతవకలు, ఇసుక అక్రమాలు, అసైన్డ్ భూములు , ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులను పేర్కొంటూ, వీటిపై వెంటనే సిబిఐతో విచారణ జరిపించాలని పిటిషన్ దాఖలు చేశారు.
![Telugu Amravati Road, Ap Skill Scam, Atchenna, Balgangadhar, Chandrababu, Lokesh Telugu Amravati Road, Ap Skill Scam, Atchenna, Balgangadhar, Chandrababu, Lokesh](https://telugustop.com/wp-content/uploads/2024/07/pil-in-ap-high-court-against-cm-chandrababu-naidu-detailss.jpg)
స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ బాలగంగాధర్ తిలక్( Balagangadhar Tilak ) 2014 నుంచి 19 వరకు టిడిపి హయాంలో అనేక శాఖల్లో జరిగిన అవినీతి ఆరోపణలపై చంద్రబాబుతో పాటు, అప్పటి మంత్రులుగా ఉన్న అచ్చెన్న నాయుడు,( Atchennaidu ) నారాయణ,( Narayana ) లోకేష్ ,కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, చింతమనేని ప్రభాకర్ తో పాటు , మొత్తం 114 మందిని ప్రశ్నించాల్సిందిగా కోరుతూ .వారిని ప్రతివాదులుగా చేర్చారు పిటీషనర్ బాలగంగాధర్ తిలక్. అసలు ఈ పిటీషన్ ను ఇప్పుడు దాఖలు చేయడానికి కారణాలను పిటిషనర్ వివరించారు.
![Telugu Amravati Road, Ap Skill Scam, Atchenna, Balgangadhar, Chandrababu, Lokesh Telugu Amravati Road, Ap Skill Scam, Atchenna, Balgangadhar, Chandrababu, Lokesh](https://telugustop.com/wp-content/uploads/2024/07/pil-in-ap-high-court-against-cm-chandrababu-naidu-detailsa.jpg)
ప్రస్తుతం ఏపీలో టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులంతా ప్రభుత్వంకు అనుకూలంగా వ్యవహరిస్తుండడం వల్ల ఇలాంటి కేసులపై ప్రభావం పడుతుందని, డీజీపీ స్థాయి అధికారులు కూడా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని , అందుకే నిష్పాక్షిక పారదర్శకమైన దర్యాప్తు కోసం కేసుల్ని కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని పిటిషన్ దాఖలు చేశారట. దీనిపై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది.బాల గంగాధర్ తిలక్ పిటీషన్ ను విచారణకు స్వీకరిస్తుందా ? చంద్రబాబుపై సీబీఐ విచారణకు అదేశిస్తుందా అనేది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.